శ్రీను వైట్ల సినిమాల్లో కామెడీ ఎలా ఉంటుందనేది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తాను ఎలాంటి సినిమా తీసినా కానీ కామెడీ మాత్రం మిస్ కాని శ్రీను వైట్ల తన తాజా చిత్రం ఆగడులో కూడా హై డోస్ ఆఫ్ కామెడీ పెట్టాడట. సినిమాలో మాస్ ఎలిమెంట్స్ బాగా ఉన్నా కానీ కామెడీ మాత్రం ప్రతి సీన్‌లోను హైలైట్‌గా నిలుస్తుందట. యాక్షన్ సీన్స్, లవ్ సీన్స్‌లో కూడా కామెడీ ఉంటుందని, సినిమాలో డల్ మూమెంట్ అంటూ ఉండదని ఇన్‌సైడ్ రిపోర్ట్. ఇందులోని ప్రతి క్యారెక్టర్ హైలైట్‌గా నిలుస్తుందని, చిన్న క్యారెక్టర్ అయినా కానీ గుర్తుండిపోయేలా తీర్చి దిద్దారని తెలిసింది.
శ్రీను వైట్ల ఆస్థాన హాస్యశిఖామణి బ్రహ్మానందంకి తోడు ఇందులో పోసాని కూడా చెలరేగిపోయాడని టాక్. సాదా సీదా కామెడీ ఉంటేనే ఆడియన్స్ ఎగబడి చూసేస్తున్న ఈ రోజుల్లో ఆగడు సినిమా ఆద్యంతం పొట్ట చెక్కలయ్యే కామెడీతో నవ్విస్తే ఇక ఒక్కొక్కరు ఎన్నేసి సార్లు సినిమా చూస్తారో మరి. ఈ చిత్రానికి పోటీగా పలు చిత్రాలు విడుదలువుతున్నా కానీ ఆగడు దూకుడుని ఆపడం ఎవరి తరం కాదనే నమ్మకం నిర్మాతల్లో బాగా కనిపిస్తోంది
0 comments:
Post a Comment