ఒకప్పుడు టాలీవుడ్ లో వరుసగా హిట్స్ ఇచ్చిన రంభ పేరు చెప్పగానే పలు కమర్షియల్ సినిమాలు వరుసగా కళ్ల ముందు కదులుతాయి. దివ్యభారతిని పోలిన ముఖ కవళికలతో తెలుగులో తెరంగేట్రంచేసిన నటి రంభ. దక్షిణాదిన పలు సినిమాల్లో నటించిన ఈ భామ ఇంద్రన్ పద్మనాభన్‌ను పెళ్లి చేసుకుని టొరంటోలో సెటిలైంది. ఈ దంపతులకు ఓ కూతురు కూడా ఉంది. రంభకి చెన్నైలోనూ, హైదరాబాద్‌లోనూ సొంతంగా ఇళ్లున్నాయి. హైదరాబాద్‌లోని ఇంట్లో ఆమె సోదరుడు ఉంటున్నాడు. ఆమె సోదరుడు శ్రీనివాసన్‌కు, అతని భార్య పల్లవికి కొంతకాలంగా మనస్పర్థలు సాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో వరకట్నం కోసం తనను వేధిస్తున్నారని పల్లవి తన భర్తమీద, ఆడపడుచు రంభ మీద కూడా గతంలో కేసు పెట్టింది. ఎక్కడో విదేశాల్లో ఉన్న తను పల్లవిని వేధించడమేంటని రంభ కూడా పోలీసులకు సమాధానమిచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల రంభ తన బీరువాలో ఉంచిన రూ.4.5కోట్ల నగలు చోరీకి గురయ్యాయి. వాటిని తన భార్య తరఫు వారే తీసి ఉండవచ్చని, తనని రూ.కోటి అడుగుతూ గత కొంతకాలంగా వేధిస్తున్నారని కూడా శ్రీనివాసన్ పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడి.
0 comments:
Post a Comment