జూనియర్ ఎన్టీఆర్ ‘టెంపర్’ ఈనెల 13వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. గత కొంత కాలంగా తను నటించిన చాత్రాలు బాక్సాపీస్ వద్ద సరైన విజయం దక్కక తీవ్ర అసంతృప్తిలో వున్న ఎన్టీఆర్, ఆయన అభిమానులు.. ఈ సినిమా విజయం సాధిస్తుందని భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన పూరీ కూడా ఈ మూవీపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఇలా చాలా మంది టెంపర్ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీ తరువాత ఎన్టీఆర్ నటించబోతున్న అప్ కమింగ్ మూవీపై హైప్ క్రియేట్ అవుతుంది.
గతంలో ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్’లో ఓ మూవీ తెరకెక్కే అవకాశాలున్నాయని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సుకుమార్ తెరకెక్కించిన ‘నేనొక్కడినే’ మూవీ ఫ్లాప్ కావడంతో ఎన్టీఆర్ అతనితో మూవీ తీసేందుకు ఎన్టీఆర్ డ్రాప్ అయ్యాడని రూమర్లు వచ్చాయి. అయితే.. అలాంటిదేమీ లేదంటూ ఆ గాసిప్స్’ను కొట్టిపారేశారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి తమ సినిమాను రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు.
‘టెంపర్’ మూవీ రిలీజ్ అయిన తర్వాత కొన్ని రోజుల వరకు ఎన్టీఆర్ రెస్ట్ తీసుకోనున్నాడు. ఆ తర్వాతే అతను సుకుమార్ తెరకెక్కిస్తున్న మూవీ రెగ్యులర్ షూటింగ్’లో పాల్గొనేలా ప్లాన్ చేసుకున్నాడని సమాచారం! ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ తన మ్యూజిక్ ని అందిస్తుండగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్’గా ఫిక్సయ్యింది. ఇప్పటికే దాదాపు ఈ మూవీ ప్రి ప్రొడక్షన్, స్ర్కిప్ట్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయని సమాచారం.
0 comments:
Post a Comment