మన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏం కావాలో, సరిగ్గా దానినే ఇస్తుంది స్టార్ హీరోయిన్ రెజీనా. రెజీనా కేవలం గ్లామర్ పాత్రలనే కాదు, యాక్టింగ్ కి స్కోప్ వున్న పాత్రలని కూడ చాలా ఈజీగా చేస్తుంది. దీనితో మన హీరోలు, దర్శకులు రెజీనా అంటే బాగా ఇష్టపడుతున్నారు. వీరితో పాటు నిర్మాతలు కూడా సిద్దంగానే ఉన్నారు.
చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని చిత్రాలలోనూ అందరి హీరోలకి సరిపోయే ఫిజిక్ రెజీనాది. ప్రస్తుతం సమంత లాంటి హీరోయిన్స్ కి కోట్ల రూపాయలను ఇచ్చే బదులు, రెజీనా లాంటి హీరోయిన్ ని పెట్టుకుంటే 50 లక్షల లోపే ప్యాకేజ్ ని ముగించేయవచ్చుఅంటూ నిర్మాతలు ఆలోచిస్తున్నారు. అందుకే రెజీనా తన మనసులోని మాటలను బయటకు చెప్పుకుంది.
త్వరలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన రెజీనా నటించే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్. తనకి ఆఫర్స్ ఎక్కువుగా వస్తున్న కారణంగా ఒకేసారి రెమ్యునరేషన్ ని డబుల్ చేసే ఉద్ధేశం కూడ లేదని అంటుంది రెజీనా. సమయం చూసి రెమ్యునరేషన్ ని పెంచుకుంటాను, అది కూడా నిర్మాతలకు పెద్దగా ఇబ్బంది లేకుండానే అని తెలివిగా జవాబు ఇస్తుంది. ఇదిలా ఉంటే అందరి సౌత్ హీరోయిన్స్ లాగే, రెజీనా కూడ బిటౌన్ లో ఆఫర్స కోసం ఎదురుచూస్తున్నట్టు తాజాగా టాక్స్ వినిపిస్తున్నాయి.
0 comments:
Post a Comment