Menu

tempeer-jr-ntr

తెలుగు ఫిల్మ్ ఇండస్త్రీ కి సెంటిమెంట్లు చాలా ఎక్కువ. సెంటిమెంట్‌ పరంగానే అంచనాలేస్తుంటారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన 'టెంపర్‌' సినిమాకీ ఈ సెంటిమెంట్‌ అంచనాలే ప్లస్‌ అయ్యేలా ఉన్నాయి. 'టెంపర్‌' నిర్మాత బండ్ల గణేష్‌కి, హీరో ఎన్టీఆర్‌తో రెండో సినిమా. ఫస్ట్‌ మూవీ 'బాద్‌షా' ఎబౌ యావరేజ్‌. తనకి బాగా ఇష్టమైన హీరో పవన్‌కళ్యాణ్‌తో గణేష్‌ రూపొందించిన ఫస్ట్‌ మూవీ 'తీన్‌మార్‌' ఫ్లాప్‌. పవన్‌తో గణేష్‌ సెకెండ్‌ మూవీ 'గబ్బర్‌సింగ్‌' సెన్సేషన్‌ హిట్‌. ఆ యాంగిల్‌లో గణేష్‌, ఎన్టీఆర్‌ నుండి వస్తున్న 'టెంపర్‌' సెన్సేషనల్‌ హిట్‌ అయ్యే ఛాన్సుందంటున్నారు. 

ప్రీ రిలీజ్‌ బజ్‌ కూడా 'టెంపర్‌'కి కలిసొచ్చేలా ఉంది. ఫస్ట్‌ డే టాక్‌ ఎలా ఉన్నా, ఓపెనింగ్‌ రికార్డ్స్‌లో 'టెంపర్‌' సెన్సేషన్‌ సృష్టించడంలో డౌట్స్‌ అవసరం లేదు. ప్రొడ్యూసర్‌ సెంటిమెంట్‌కి తోడుగా ఈ ఇయర్‌ నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన 'పటాస్‌' సూపర్‌ హిట్‌ అవడంతో, ఆ హిట్‌ వేవ్‌ని ఎన్టీఆర్‌ 'టెంపర్‌'తో కొనసాగిస్తాడని ఫాన్స్‌ ఆశిస్తున్నరు. 'టెంపర్‌' మూవీలో ఎన్టీఆర్‌తో అందాల భామ కాజల్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకోనుంది . ఎన్టీఆర్‌, కాజల్‌ కాంబినేషన్‌లో ఇదివరకు వచ్చిన 'బృందావనం' పెద్ద హిట్‌.

0 comments:

Post a Comment

 
Top