ఆల్ ఇండియా బక్‌చోద్ ఛానల్ తీసిన 'రోస్ట్' షోని ఇండియా నుంచి నిషేధించాలనే డిమాండ్లు పెరిగాయి. యూట్యూబ్ వీడియోలపై సెన్సార్‌షిప్ లేకపోయినా కానీ దీనిపై ముదురుతోన్న వివాదంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ షోని వీక్షించిన ఓ సెన్సార్ ఆఫీసర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసాడు. తనకి ఇష్టమైన సెక్స్ పొజిషన్ గురించి ఈ షోలో వ్యక్తపరచిన కరణ్ జోహార్‌తో 'సెక్స్ పరంగా నీకు ఇష్టమైన యాంగిల్స్ గురించి నీ అమ్మకి చెప్పుకో. ఇలా పబ్లిక్‌కి చెప్పాల్సిన అవసరం లేదు' అని సదరు సెన్సార్ ఆఫీసర్ కామెంట్ చేయడం పెను దుమారం రేపింది.
రోస్ట్ కొత్త తరహా విప్లవానికి నాంది అవుతుందని అనుకుంటే.. ఇలా పెద్ద వివాదంగా మారడంతో నిర్వాహకులు కూడా మౌనం వహిస్తున్నారు. జరుగుతోన్న దానినిబట్టి ఈ షో ఇండియాలో పర్మినెంట్‌గా బ్యాన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇది చూసి ఇన్‌స్పయిర్ అయి మరికొంతమంది రోస్ట్‌లో పాల్గొందామని అనుకున్నా కానీ ఈ అవుట్‌రేజ్ చూసి గప్‌చుప్ అయిపోయారు ఆల్రెడీ.
0 comments:
Post a Comment