గతంలో టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రంభ పెళ్ళి చేసుకుని అమెరికా వెళ్ళి పోవడంతో ఆమెకు సంబంధించిన వార్తలు పెద్దగా ఏమి వినిపించేవి కావు. అయితే గతసంవత్సరం నుండి ఆమెకు సంబంధించిన వార్తలు మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. గత సంవత్సరమే ఆమె పై అలాగే ఆమె సోదరుడు పై వరకట్న వేధింపులకు సంబంధించి కొన్ని కేసులు రిజిస్టర్ అయినట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి.
ఆ తరువాత ఆ కేసుల వ్యవహారానికి సంబంధించిన వార్తలు పెద్దగా కనిపించలేదు. ఈమధ్యకాలంలో ఈమె రెండుమూడు బుల్లితెర కార్యక్రమాలలో కూడా కనిపించి హడావిడి చేసింది. ఇక లేటెస్ట్ గా ఈమెకు సంబంధించిన నాలుగున్నర కోట్ల విలువైన బంగారు నగలు, వజ్రాల నగలు ఆమె ఆమె వదిన, అక్కలు కాజేశారని, ఈ మేరకు తాము చెన్నై విరువుంబాకం పోలీస్ స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశామని రంభ సోదరుడు వై.శ్రీనివాస్ మీడియాకు ఎక్కాడు.
అంతేకాదు అకారణంగా తన పైనా తన సోదరి రంభ పైనా వరకట్న వేధింపుల కేసులు పెట్టి తమను మానసికంగా బాధ పెడుతున్నారని తమ చుట్టాల పైనే రంభ సోదరుడు శ్రీనివాస్ ఆరోపణలు చేస్తున్నాడు.
కోట్లాది రూపాయల విలువైన ఆభరణాలకు సంబంధించిన ఆరోపణలు కావడంతో ప్రస్తుతం మీడియాకు ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారం రానున్న రోజులలో మరింక ఎన్ని ట్విస్టులు తీసుకుంటుందో చూడాలి.
source:http://www.apherald.com/MOVIES/ViewArticle/77670/RAMBHA-4-5-CRORES-JEWELRY-RAGADA-/
0 comments:
Post a Comment