Menu

PrabhasBahubali

ఎట్టకేలకు ‘బాహుబలి’ లీక్ కు సంబంధించి ఒక ఐటి కంపెనీలో మేనేజర్ గా పనిచేసిన బివివి ఎల్ ఎన్ వర్మ అనే వ్యక్తిని పోలీసులు అరస్టు చేసినట్లుగా వార్తలు మీడియాలో వస్తున్నాయి. అయితే ఈ లీక్ కు సూత్రధారి అయిన వర్మ చెప్పిన విషయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ‘బాహుబలి’ చిత్రాన్ని ఎడిటింగ్ చేస్తున్న మకుట సంస్థలో ఐటి మేనేజర్ గా వర్మ పనిచేసేవాడట.

అయితే జనవరి మొదటి వారంలో వర్మను ఆ సంస్థ నుంచి తొలగించారట. దీనితో కక్షను పెంచుకున్న వర్మ తన ఉద్యోగం వదిలి వెళ్ళే సమయంలో బాహుబలికి సంబంధించిన కొన్ని దృశ్యాలను దొంగిలించి లీక్ చేసాడని మీడియా టాక్. టాలీవుడ్ చలన చిత్ర చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా లీక్ విషయం ఒక కొలిక్కి వచ్చినా ఈ లీక్ వెనక ఉన్న పగ అందర్నీ ఆశ్చర్య పరిచింది.

దీనితో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్న రాజమౌళి ‘బాహుబలి’ సినిమాకు సంబంధించి ఎటువంటి పొరపాట్లు జరగకుండా రాజమౌళి చాల కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాడని టాక్. ఇది ఇలా ఉండగా ఈనెల మొదటి వారంలో విడుదల కాబోతున్న ఈ సినిమా టీజర్ కు సంబంధించిన అన్నీ ఏర్పాట్లను రాజమౌళి పూర్తి చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

ఈ టీజర్ తరువాత ‘బాహుబలి’ క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాను ఇప్పటికే కొనుక్కున్న బయ్యర్లు ‘బాహుబలి’ మొదటి భాగంలో అనుష్క కనిపించదు అని ఈ మధ్య వచ్చిన వార్తలను చూసి టెన్షన్ పడుతున్నట్లు టాక్.

source:http://www.apherald.com/MOVIES/ViewArticle/77668/REASON-BEHIND-BHHUBALI-LEAK-IS-VENGENCE/

0 comments:

Post a Comment

 
Top