సూపర్‌స్టార్ మహేష్‌బాబు తన తదుపరి చిత్రాలేంటనేది ఫిక్స్ అయిపోయాడు. కొరటాల శివ డైరెక్షన్‌లో శ్రీమంతుడు చిత్రంతో బిజీగా ఉన్న మహేష్ తన నెక్స్‌ట్ ప్రాజెక్టులని ఓకే చేసేసాడు. ముందుగా త్రివిక్రమ్ డైరెక్షన్‌లో సినిమా ఉంటుంది. దాని తర్వాత శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్‌లో 'బ్రహ్మూత్సవం' చిత్రం చేస్తాడు. ఇవి రెండూ అయిన తర్వాత నెక్స్‌ట్ ప్రాజెక్ట్ ఏంటనేది డిసైడ్ అవుతాడు.
వరుసగా రెండు పరాజయాలు రావడంతో మహేష్ ఇప్పుడు తన బలాల మీదే కాన్సన్‌ట్రేట్ చేస్తున్నాడు. మహేష్‌కి ఫ్యామిలీస్‌లో, క్లాస్ ఆడియన్స్‌లో ఫాలోయింగ్ ఎక్కువ. ఇప్పుడు తను ఓకే చేసిన సినిమాలన్నీ కూడా వీరిని టార్గెట్ చేసిన చిత్రాలే కావడం విశేషం. శ్రీమంతుడు కూడా సెంటిమెంట్ ప్రధానంగా సాగే చిత్రమే అంటున్నారు. నంబర్‌వన్ రేసులో టాప్‌లో దూసుకు వెళుతున్న టైమ్‌లో మహేష్ గ్రిప్ కోల్పోయాడు. 1, ఆగడు ఫ్లాప్స్ అతడి డామినేషన్‌కి బ్రేక్స్ వేసాయి. అందుకే వరుసగా నాలుగైదు భారీ హిట్లు ఇచ్చే వరకు వేరే జోనర్స్ జోలికి పోరాదని మహేష్ ఫిక్స్ అయినట్టున్నాడు.
source:http://telugu.gulte.com/tmovienews/8432/Mahesh-babu-fixes-for-family-entartainers
0 comments:
Post a Comment