‘పటాస్’ సూపర్ సక్సస్ తో మంచి జోష్ మీద ఉన్న కళ్యాణ్ రామ్ తన భవిష్యత్ ప్రణాళికలు గురించి వివరిస్తూ మీడియాకు వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాడు. ఈ సందర్భంలో ఒక మీడియా ప్రతినిధి నందమూరి కుటుంబం నుండి నాలుగవ తరం లో ‘దాన వీర శూర కర్ణ’ తో మాస్టర్ ఎన్టీఆర్ తెరంగేట్రం చేస్తున్నాడు మరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు అని ప్రశ్నించగా మీడియాకు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చాడు.
కొన్ని మీడియా వర్గాలలో తాను మోక్షజ్ఞ తొలిసినిమాను తన సొంత బ్యానర్ పై నిర్మిoచ బోతున్నట్లుగా వస్తున్న వార్తలలో నిజంలేదని అయితే అటువంటి అవకాశం వస్తే తనకన్నా ఆనందించే వారు మరొకరు ఉండరు అని చెపుతూ ప్రస్తుతానికి మోక్షజ్ఞ ఎంట్రీ పై తన బాబాయ్ బాలకృష్ణ ఇంకా ఎటువంటి నిర్ణయం పూర్తిగా తీసుకోలేదని అసలు విషయాన్ని బయటకు చెప్పాడు కళ్యాణ్ రామ్.అలానే తన బాబాయి బాలకృష్ణ గురించి మాట్లాడుతూ ‘బాలగోపాలుడు’ సినిమాలో తనను బాల నటుడిగా పరిచయంచేసి కెమెరా ముందు ఎలా నటించాలో ఓనమాలు నేర్పించిన వ్యక్తి బాబాయి అంటూ బాలకృష్ణను ఆకాశానికి ఎత్తేశాడు. తమ కుటుంబంలో ఎంత మంది హీరోలు ఉన్నా బతుకుతున్నది మాత్రం తమ తాత తారకరామారావు పేరు చెప్పుకుని మాత్రమే అన్న విషయం తమకు తెలుసు అని వ్యాఖ్యానించాడు కళ్యాణ్ రామ్.
‘మనం’ సినిమాలా తమ కుటుంబ సభ్యులు అందరూ కలిసి నటించే సినిమా గురించి కలలు కంటున్నానని ఆ కలలు త్వరలోనే తీరుతాయని ఆశ పడుతున్నాడు కళ్యాణ్ రామ్.

0 comments:
Post a Comment