ఫిలింనగర్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా యంగ్ హీరోయిన్ మధురిమ గురించి కబుర్లు వినపడుతున్నాయి. అల్లు శిరీష్ తో ‘కొత్త జంట’ లో తళుక్కు మన్న మధురిమ ఏకంగా జూనియర్ ‘టెంపర్’ లో ఒక ముఖ్య పాత్రను చేస్తూ ఉండటంతో అందరు ఆమె అదృష్టానికి ఆశ్చర్య పోయారు. ఈ సినిమా ఇంకా విడుదల కాకుండానే అక్కునేని నాగార్జున వారసుడు నాగచైతన్యతో ఈమె స్టెప్స్ వేయబోతు ఉండటం మరింత ఆశ్చర్య పరుస్తోంది.
ఫిలింనగర్ వార్తల ప్రకారం సుదీర్ వర్మ నాగాచైతన్యతో తీస్తున్న లేటెస్ట్ సినిమాలో ఒక అదిరిపోయే ఐటమ్ సాంగ్ కు మధురిమ ఓకే చెప్పింది అనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు కూడా మంచి అంచనాలే ఉండటంతో ఒకే సంవత్సరంలో నందమూరి అక్కినేని కుటుంబ హీరోలతో రొమాన్స్ చేసిన రికార్డు మధురిమ కొట్టేసింది అని ఆమె అదృష్టానికి ఆశ్చర్య పోతున్నారు.
ఈ వార్తలు ఇలా ఉండగా ఆమెకు టాలీవుడ్, కోలీవుడ్ లతో పాటు బాలీవుడ్ లో కూడా చాల అవకాశాలు వస్తున్నట్లుగా వార్తలు వినపడుతున్నాయి. ఈ స్పీడ్ చూస్తుంటే అనుకున్న ప్రకారం ‘టెంపర్’ సూపర్ హిట్ అయితే మధురిమ టాలీవుడ్ సినిమా రంగంలో ప్రస్తుతం ఏర్పడ్డ హీరోయిన్స్ కొరతను తీర్చే గ్లామర్ బ్యూటీగా మారిపోవడం తధ్యం.
ఈ సంవత్సరం మధురిమ కలిసి వచ్చే సంవత్సరంగా మారి కెరియర్ టర్న్ తీసుకుంటుందని విశ్లేషకులు అంటున్నారు. ఏమైనా మధురిమకు లక్ కిక్ బాగుంది..
0 comments:
Post a Comment