అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ తీస్తున్న 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రంలో ఒక కథానాయికగా నిత్యామీనన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. నెగెటివ్ షేడ్స్ ఉండే ఈ పాత్ర కోసం త్రివిక్రమ్ చాలా మంది హీరోయిన్ల పేర్లు పరిశీలించి చివరకు నిత్యామీనన్‌ని ఓకే చేసాడు. నిత్యామీనన్‌కి స్టార్ వేల్యూ లేకపోయినా నటిగా మంచి పేరు ఉంది కనుక ఈ కీలక పాత్ర మెప్పిస్తుందని అతను భావించాడు. అయితే స్టార్ కాకపోయినా కానీ నిత్యామీనన్ వేసే ఎక్స్‌ట్రాలు త్రివిక్రమ్‌ని టార్చర్‌కి గురి చేస్తున్నాయట. తనని తాను చాలా ఎక్కువగా అంచనా వేసుకునే నిత్య ఇంత పెద్ద ప్రాజెక్ట్‌కి తగ్గ రెస్పెక్ట్ ఇవ్వడం లేదట. చిన్న సినిమాల షూటింగ్‌లో ఆ దర్శకులు, నిర్మాతలతో ఎలా అయితే బిహేవ్ చేస్తుందో ఇక్కడ కూడా అదే రిపీట్ చేస్తోందట.
కానీ ఇప్పుడు రీప్లేస్‌మెంట్ కష్టం కాబట్టి నిత్య చూపిస్తోన్న నరకాన్ని త్రివిక్రమ్ భరిస్తున్నాడట. టాలెంట్‌తో పాటు సక్సెస్ ఉన్నా కానీ నిత్యామీనన్‌కి ఎక్కువ అవకాశాలు రాకపోవడానికి కారణం కూడా ఇదే అనే టాక్ ఉంది. సత్యమూర్తి రిలీజ్ అయిన తర్వాత నిత్య రేంజ్ పెరుగుతుందేమో అనుకుంటే ఇప్పుడు స్ప్రెడ్ అవుతోన్న ఈ బ్యాడ్ టాక్ ఆమె కెరియర్‌ని ఎఫెక్ట్ చేసే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.
source:http://telugu.gulte.com/tmovienews/8457/Trivikram-irks-with-Nitya-Menon-for-Son-of-Satya-murthy
0 comments:
Post a Comment