Menu

bahubali-rudrammadevi
ఈ ఏడాది తెలుగులో మోస్ట్ అవైటెడ్ మూవీస్ ఏవంటే.. బాహుబలి, రుద్రమదేవి ముందు వరుసలో ఉంటాయి. ఈ రెండు సినిమాలకు చాలా పోలికలున్నాయి. రెండూ చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమాలు. రెండింట్లోనూ అనుష్క హీరోయిన్. రెండింట్లోనూ యుద్ధ సన్నివేశాలే కీలకం. బాహుబలి, రుద్రమదేవి సినిమాల రిలీజ్ కూడా కొన్ని రోజుల వ్యవధిలోనే ఉండబోతోంది. ఐతే రుద్రమదేవి మూవీతో పోలిస్తే బాహుబలికి క్రేజ్ చాలా ఎక్కువే. ఇందులో ఆకర్షించే అంశాలు చాలానే ఉన్నాయి. రాజమౌళి దర్శకత్వం వహిస్తుండడం.. ప్రభాస్ హీరోగా నటిస్తుండటంతో ఆటోమేటిగ్గా క్రేజ్ వచ్చేసింది. ఇంకా చాలా ఆకర్షణలు తోడై.. సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.

ఐతే బాహుబలితో పోలిస్తే రుద్రమదేవికి కొన్ని మైనస్‌లున్నాయి. ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ. పైగా దర్శకుడు గుణశేఖర్ ట్రాక్ రికార్డు బాగాలేదు. దీంతో సినిమా బిజినెస్ విషయంలోనూ కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సమాచారం. ఐతే ఏదేమైనా కానీ ఈ సినిమాను మార్చిలో విడుదల చేసి తీరాల్సిందే. లేకుంటే చాలా కష్టం. ఎందుకంటే ఏప్రిల్ 17న బాహుబలి విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఆ సినిమా తర్వాత రుద్రమదేవి వచ్చిందంటే అంతే సంగతులు. ఎందుకంటే రెండూ యుద్ధ నేపథ్యంలో సాగే సినిమాలే. ఆ సన్నివేశాలే రెండింట్లోనూ ప్రధాన ఆకర్షణ. రాజమౌళి ఈ సన్నివేశాల్ని ఎలా తీసి ఉంటాడో అంచనా వేయొచ్చు. ఈ మధ్య లీకైన వీడియోలు చూస్తేనే సీన్ అర్థమైపోతోంది. గుణశేఖర్ ఎంత గొప్పగా తీసి ఉన్నా.. ఆ రేంజిని అందుకోవడం కష్టమే. అలాంటిది బాహుబలి విడుదలై, యుద్ధ సన్నివేశాల్ని జనాలు చూశారంటే.. మళ్లీ ‘రుద్రమదేవి’ చూడ్డానికి పెద్దగా ఆసక్తి చూపించరు. కాబట్టి ఏం చేసైనా సరే.. బాహుబలి కంటే ముందు రుద్రమదేవి విడుదల చేసి తీరాల్సిందే. 

source:http://telugu.gulte.com/tmovienews/8456/Rudramadevi-fears-with-Bahubali

0 comments:

Post a Comment

 
Top