హిందీ సినిమాల్లోకి వెళ్ళి తెలుగులో కెరీర్‌ని కొంచెం డల్ చేసుకున్న కాజల్ అగర్వాల్ తొందరగానే పరిస్థితుల్ని అర్థం చేసుకుంది. హిందీ ప్రాజెక్ట్స్‌కి బ్రేక్ ఇచ్చి, తెలుగుతోపాటుగా తమిళ సినిమాల్ని ఒప్పుకుంది. అక్కడా ఇక్కడా టైమ్ ప్లాన్ చేసుకుంటూ, ఏ నిర్మాతకీ ఇబ్బంది కలగకుండా కాజల్ అగర్వాల్ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. తెలుగులో సమంత కారణంగా ఒకప్పుడు కాజల్‌కి డిమాండ్ తగ్గినా, తిరిగి కాజల్ తన డిమాండ్ పెంచుకుంది. సమంత వరుస ఫ్లాపులతో సతమతమవుతుండడం కాజల్‌కి కలిసొచ్చింది.
'టెంపర్' ఒక్కటే కాజల్ ప్రస్తుతం చేస్తున్న సినిమా అయినా, దాంతోపాటు ఇంకో రెండు హాట్ ఆఫర్స్ కాజల్ చేతిలో ఉన్నాయట. సమంత పరిస్థితి కాజల్‌కి భిన్నంగా ఉంది. ఆమె చేతిలో కూడా ఒక్కటే తెలుగు సినిమా ఉన్నా, ఇదివరకు ఉన్న డిమాండ్ సమంతకి ఇప్పుడు లేదు. రెమ్యునరేషన్ వైజ్‌గా తీసుకున్నా సమంతని కాజల్ వెనక్కి నెట్టిందంటున్నారు. హిందీలో రెండు సినిమాలు చేస్తున్న కాజల్, తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది. అవీ ఇవీ అన్నీ కలుపుకుంటే, సమంతకన్నా ఎంతో ముందుంది అవకాశాల పరంగా కాజల్ అగర్వాల్.
source:http://telugu.gulte.com/tmovienews/8437/Kajal-retains-her-position-over-Samantha
0 comments:
Post a Comment