March 16, 2025 12:59:06 PM Menu
Latest

6:28 PM test1

దక్షిణ భారత దేశంలోనే కాదు బాలీవుడ్ లో కూడ క్రియేటివ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మణిరత్నం ఎన్నో హిట్ సినిమాలను అందించాడు. అయితే గత కొద్ది కాలంగా ఆయన హవా తగ్గడంతో మణిరత్నం సినిమాలకు క్రేజ్ బాగా తగ్గింది. దీనితో మరింత రెట్టించిన ఉత్సాహంతో మణిరత్నం యూత్ కు నచ్చేలా ఒక లవ్ స్టోరీని తయారు చేసుకుని ఆ సినిమాకు ముమ్ముట్టి కొడుకు డల్క్వేర్ సల్మాన్, నిత్యామీనన్ లను హీరో హీరోయిన్స్ గా పెట్టి తెలుగు, తమిళ భాషలలో సినిమాలు తీస్తున్నాడు.

ఈ సినిమా తెలుగు వర్షన్ కు ‘ఓకె బంగారం’ అన్న టైటిల్ ను కూడ ఫిక్స్ చేసారు. అయితే ఈసినిమా 2000 సoవత్సరంలో మణిరత్నం దర్శకత్వం వహించి సూపర్ హిట్ అయిన ‘సఖి’ సినిమాకు మోడ్రన్ వెర్షన్ అన్న ప్రచారం కూడ జరుగుతోంది. అప్పట్లో మణి రత్నం ఈ సినిమాను మాధవన్, షాలిని లను హీరో, హీరోయిన్స్ గా పరిచయం చేస్తూ విడుదలైన ‘సఖి’ ఆనాటి యూత్ కు బాగా నచ్చిన సినిమా గా పేరు పడింది.ఈ సినిమా తెలుగులో కూడా బాగా హిట్ టాక్ తెచ్చుకుంది.

అప్పట్లో ఈ సినిమాను 2000 సంవత్సరం ఏప్రియల్ 14న విడుదల చేసారు. ఈ సినిమా విడుదలైన 15 సంవత్సరాల తరువాత మణిరత్నం అదే సెంటిమెంట్ ను కొనసాగిస్తూ ఈ సంవత్సరం ఏప్రియల్ 14న విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఇదే ఏప్రియల్ లో 17వ తారీఖున విడుదల కాబోతున్న రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి’ ని ఢి కొడుతూ మణిరత్నం ఇటువంటి సాహస పూరితమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో ఎవరికీ అర్ధంకాని విషయం. ఈ వార్తలే నిజం అయితే ఒకనాటి స్టార్ డైరెక్టర్ మణిరత్నం నేటి తరం స్టార్ డైరెక్టర్ రాజమౌళిని కార్నర్ చేయడం టాపిక్ ఆఫ్ సౌత్ సినిమాగా మారుతుంది.

source:http://www.apherald.com/Movies/ViewArticle/79155/RAJAMOULI-GETTING-CORNERED-BY-MANIRATNAM/
19 Feb 2015

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top