తాజాగా తెలుస్తున్న క్లియర్ టాక్స్ ప్రకారం, ప్రముఖ టీవీ ఛానల్ రూ. 8.5 కోట్లకు ఈ చిత్ర రైట్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మొదటగా 7 కోట్ల వరకూ ఫైనల్ అయిన ఈ ధర, అమాంతంగా మరో పోటీ ఛానల్ వచ్చిన 8.5 కోట్లకి కోట్ చేయడంతో, రుద్రమదేవి శాటిలైట్ రైట్స్ ని దక్కించుకోగలిగింది. ఈ మూవీకి దాదాపు 70 కోట్లపెట్టుబడితో తెరకెక్కుతోంది.
అనుష్క, అల్లు అర్జున్, రానా నటిస్తుండటం వల్లే ఇంత రేటు వచ్చినట్లు తెలుస్తోంది. గుణశేఖర్ దాదాపు 9 సంవత్సరాలు రీసర్చ్ చేసి తెరకెక్కించిన పీరియాడికల్ సినిమా ఇది. ఇండియాలోనే మొట్టమొదటి సారిగా గుణశేఖర్ స్టీరియో స్కోపిక్ ద్వారా తెరకెక్కిస్తున్న హిస్టారికల్ 3డి మూవీ ఇది.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మార్చి చివరి వారంలో సినిమా విడుదల కానుంది. అలాగే ఆడియో కి సంబంధించిన రైట్స్ కూడ భారీ దర పలికినట్టు తెలుస్తుంది. ఇంకా రుద్రమదేవి మూవీకి సంబంధించిన డిజిటల్ బిజినెస్ మొత్తాన్ని కలుపుకుంటే ఈ మూవీ, రిలీజ్ కి ముందుగానే దాదాపు 30 కోట్ల రూపాయల బిజినెస్ చేసిందని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి.
source:http://www.apherald.com/Movies/ViewArticle/79130/anushkha-baahubali-rudramadevi-rajamouli-keeravani/
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.