టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు యంగ్ హీరో శర్వానంద్ సెంటిమెంట్ ను అనుసరించడం టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది. నిన్న మొన్నటి దాకా మహేష్ శ్రీకాంత్ అడ్డాల ‘బ్రహ్మోత్సవం’ సినిమాను ఈ సమ్మర్ నుండి పట్టాలు ఎక్కిస్తాడు అని ఊహిస్తున్న నేపధ్యంలో మహేష్ ఆలోచనలు యూటర్న్ తీసుకుని తిరిగి పూరి జగన్నాథ్ వైపు మళ్ళాయి అనే వార్తలు వస్తున్నాయి.
దీనికికారణం రచయిత వక్కంతం వంశీ అని అంటున్నారు. వంశీ తయారుచేసిన ఒక మంచి కథ మహేష్ కు బాగా నచ్చడంతో ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాలను వెనుకకు పెట్టి పూరి జగన్నాథ్ అశ్వినీదత్ ల సినిమాను ముందుకు తీసుకువచ్చాడు అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ జూన్ 1నుండి ప్రారంభం కాబోతోంది అని టాక్.
మహేష్ సరసన ఇద్దరి హీరోయిన్స్ ఈ సినిమాలో నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఏప్రియల్ మొదటి వారంలో ఈ సినిమా పాటల రికార్డింగ్ జరగబోతోందని తెలుస్తోంది. యంగ్ హీరో శర్వానంద్ నటించిన ‘రన్ రాజా రన్’ సినిమాకు సంగీతాన్ని అందించి ఆ సినిమా విజయంలో ప్రధాన పాత్ర పోషించిన సంగీత దర్శకుడు జిబ్రాన్ మహేష్ సినిమాకు మొట్టమొదటిసారి సంగీతాన్ని ఇచ్చే అవకాశం రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
మహేష్ బాబును టాలీవుడ్ కు పరిచయం చేసిన అశ్వనీదత్ బ్యానర్ లో మళ్ళీ మహేష్ బాబు నటిస్తూ ఉండటం మహేష్ పూరీలు మూడవ సారి ఈ సినిమా కోసం పనిచేయడం బట్టి ఈ సినిమా ఖచ్చితంగా వీరిద్దరికీ హ్యాట్రిక్ సక్సస్ ఇచ్చే సినిమాగా మారుతుందని అప్పుడే ఫిలింనగర్ లో ఊహగానలు జోరు అందుకున్నాయి.
source:http://www.apherald.com/MOVIES/ViewArticle/78057/SARWANAND-SENTIMENT-FOR-MAHESH-MOVIE/
0 comments:
Post a Comment