టాలీవుడ్ మాటల మాంత్రికుడిగా పేరు గాంచిన త్రివిక్రమ్ పవన్, మహేష్ లతో అతి సన్నిహితంగా ఉంటాడు అన్నది ఓపెన్ సీక్రెట్. త్రివిక్రమ్ తో సినిమాలు చేయాలని చాల మంది హీరోలు ప్రయత్నిస్తున్నా త్రివిక్రమ్ మాత్రం వీలైనంత వరకు పవన్ మహేష్ లతో ఎక్కువ సినిమాలు తీయడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు.
తన భావాలు, ఆలోచనలు పవన్ మహేష్ ల ఆలోచనలు ఒకలాగే ఉంటాయి కాబట్టి ఈ ఇద్దరితో తనకు సినిమాలు తీయడంలో ఎటువంటి సమస్య రాదు అని ఒక ఇంటర్వ్యూలో బహిరంగంగానే చెప్పాడు త్రివిక్రమ్. ఈ నేపధ్యంలో త్రివిక్రమ్ ప్రస్తుతం అల్లుఅర్జున్ తో దర్శకత్వం వహిస్తున్న ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ ఆడియో వేడుకకు పవన్ మహేష్ లను అతిధులుగా పిలిచి ఒక రికార్డు క్రియేట్ చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు అనే వార్తలు వినపడుతున్నాయి.
అయితే గత సంవత్సరం హూదూద్ బాధితుల కోసం టాలీవుడ్ పరిశ్రమ నిర్వహించిన ‘మేముసైతం’ కార్యక్రమానికి కూడ రాని పవన్ మహేష్ లను త్రివిక్రమ్ తన మాటల మాయతో బన్నీ సినిమా ఆడియో వేడుకకు రప్పించ గలిగితే ఈ సంవత్సరపు టాలీవుడ్ పరిశ్రమ అద్భుతాలలో ఒకటిగా మిగిలి పోతుంది అని భావించడంలో ఎటువంటి సందేహం లేదు.
వినడానికి ఈ వార్త ఆశ్చర్య కరంగా ఉన్నా పవన్ కళ్యాణ్ మహేష్ ల మధ్య ఉన్న పరస్పర గౌరవ అనుబంధాల మధ్య త్రివిక్రమ్ చేస్తున్న ప్రయత్నం విజయవంతం అయినా ఆశ్చర్యం లేదని కొందరి విశ్లేషకుల అభిప్రాయం. మరి ఈ మాంత్రికుడు ఈ టాప్ హీరోల పై ఎటువంటి మ్యాజిక్ చేసి వారిద్దరిని వేదిక పై కలుపుతాడో చూడాలి..
source:http://www.apherald.com/Movies/ViewArticle/78615/TRIVIKRAM-EFFORTS-ON-PAVAN-AND-TRIVIKRAM/
0 comments:
Post a Comment