రాజమౌళి ‘బాహుబలి’ మరో కొత్త వివాదంలో చిక్కుకుంది. ఈసినిమాకు సంబంధించి ఈమధ్య లీక్ అయిన దృశ్యాలలో దళితులను కించపరిచే దృశ్యాలు ఉన్నాయి అంటూ మరో కొత్త వివాదం తెర పైకి వచ్చింది. ఈసినిమాకు సంబంధించి ఫైనల్ కాపీ కూడా తయారుకాని నేపధ్యంలో ఇటువంటి వివాదాలు రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
అంతేకాదు ఈమధ్య లీక్ అయిన ఈసినిమా వీడియోలో కావాలని ఎవరైనా ఇటువంటి సంభాషణలు సృష్టించారా అనే అనుమానం కూడా చాలామందికి వస్తోంది. ఈ వార్తల నేపధ్యంలో ‘బాహుబలి’ సినిమా పై పలు దళిత సంఘాలు ట్యాంక్ బండ్ వద్దగల అంబేద్కర్ విగ్రహం వద్ద తమ నిరసనలు చేపట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
అంతేకాదు ఈసినిమా దర్శక నిర్మాతలు దళితులకు క్షమార్పణ చెప్పాలనే డిమాండ్ తెర పైకి వచ్చింది. అంతేకాదు ఏ చిత్రంలోని ఈ సన్నివేశాల పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. సామాన్యంగా సినిమా విడుదల అయ్యాక ఇటువంటి వివాదాలు రావడం సహజం.
కాని విడుదల కాకుండానే ‘బాహుబలి’ సినిమా పై ఇటువంటి వివాదాలు రావడంతో వివాదాల విషయంలో కూడా ‘బాహుబలి’ రికార్డు క్రియేట్ చేసేలా కనిపిస్తోంది.
0 comments:
Post a Comment