March 17, 2025 03:13:31 AM Menu
Latest

6:28 PM test1


సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం నెంబర్ వన్ హీరోయిన్ సమంత. అయితే సమంత చేస్తున్న మూవీలు వరుస సక్సెస్ కావడంతో, తనుకి స్టార్ హీరోల సరసన ఆఫర్స్ కూడ అంతే వేగంగా వస్తున్నాయి. ఇదిలా ఉంటే రీసెంట్ గా తను కోలీవుడ్ స్టార్ హీరో సరసన ఆఫర్ ని చేజిక్కించుకున్నాక నిర్మాతని ఇరకాటంలో నెట్టేసిందంటూ టాక్స్ వినిపిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే, టాలీవుడ్ లో అగ్ర హీరోలతో నటించిన సమంత ప్రస్తుతం తమిళ సినిమాలపై దృష్టి పెట్టింది. టాలీవుడ్ లో తివిక్రమ్ - అల్లు అర్జున్ సినిమాలో మాత్రమే నటిస్తోంది. తమిళంలో సమంత నటించిన సినిమాలు ఊహించినంత విజయం సాధించలేదు. కానీ ఇటీవలే వచ్చిన 'కత్తి' చిత్రం మంచి విజయం సాధించడంతో తనకు మళ్లీ ఆఫర్స్ వరుస పెట్టి వస్తున్నాయి.

అనుకున్నట్టే ధనుష్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. అయితే ఈ మూవీకి సమంత డేట్స్ ఇచ్చిన వెంటనే, మరో వారం రోజుల తరువాత పొరపాటు జరిగింది డేట్స్ అడ్జెట్ అవ్వడం లేదు అని నిర్మాతకి చెప్పడంతో, నిర్మాత ఖంగారు పడ్డాడు. నిర్మాత ఆసక్తి కారణంగా సమంతని వదులుకోవడం ఇష్టం లేదంట.

దీంతో నిర్మాత డిమాండ్ ని అర్ధం చేసుకున్న సమంత, రెమ్యునరేషన్ ని పెంచే విధంగా ఉంటే డేట్స్ ని ఫిక్స్ చేస్తానని చెప్పుకొచ్చింది. ఎందుకంటే ధనుష్, సమంత కాంబినేషన్ లో రాబోతున్న ఆ మూవీ 2016 చివరిలో రిలీజ్ కావొచ్చు. ఆ సమయానికి తన డిమాండ్ పెరుగుతుంది కాబట్టే, రెమ్యునరేషన్ ని పెంచుతున్నానని చెప్పుకొచ్చిందట. అదే సినిమాలో అమీ జాక్సన్ కూడా నటించబోతోంది. విఐపి చిత్ర టీం ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

source:http://www.apherald.com/Movies/ViewArticle/78127/Samantha-tollywood-vikram-dhanush-kollywood-telguu/
08 Feb 2015

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top