March 15, 2025 09:37:46 PM Menu
Latest

6:28 PM test1


దూసుకు పోతున్న రకుల్ ప్రీత్ సమంతకు పెద్ద షాక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఎదో ఒకరోజు రకుల్ సమంతకు ప్రత్యామ్నాయంగా మారుతుంది అన్న కామెంట్స్ ఎప్పటి నుంచో ఉన్నా ఆ కామెంట్స్ వాస్తవ రూపంలోకి రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. త్వరలో ప్రారంభం కాబోతున్న శ్రీను వైట్ల చరణ్ కాంబినేషన్ ల సినిమాలో మొట్టమొదటిగా సమంతను హీరోయిన్ గా ఎంచు కోవడం డానికి సమంత అంగీకరించడం కూడా జరిగి పోయాయి.

మొట్టమొదటి సారి చరణ్ తో సమంత నటిస్తూ ఉండటంతో వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుంది అన్న విషయం పై ఊహాగానాలు కూడా మెగా అభిమానులలో ఊపు అందుకున్నాయి. అయితే అనుకోని ట్విస్ట్ తో సమంత స్థానంలో రకుల్ ఇప్పుడు ఈ సినిమాలో వచ్చి చేరింది అనే వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఈ సినిమాకు ఇప్పటికే పెరిగి పోయినా బడ్జెట్ అని అంటున్నారు. కోటి రూపాయలు పైగా పారితోషికంగా తీసుకునే సమంత అదే స్థాయిలో ఈ సినిమాకు కూడా పారితోషికాన్ని డిమాండ్ చేసింది అని టాక్.

ఈ నేపధ్యంలో ఇంత పారితోషికం ఇచ్చి ఈ సినిమాకు సమంతను పెట్టుకునేకన్నా ప్రస్తుతం యూత్ లో మంచి క్రేజ్ ఉన్న రకుల్ ను ఎంపిక చేసుకుంటే బడ్జెట్ పరంగా కలిసి వస్తుంది అన్న ఆలోచన ఈ మార్పుకు కారణం అని అంటున్నారు.

రకుల్ కూడా ఊహించని అవకాశం తన ఇంటికి రావడంతో తన పారితోషికం విషయంలో ఈ సినిమా నిర్మాతలకు బాగా తగ్గించి ఈ ప్రాజెక్ట్ ను బుట్టలో పెట్టేసింది అని అంటున్నారు. ఏది ఏమైనా సమంత స్థానం రకుల్ కొట్టేసింది.

source:http://www.apherald.com/MOVIES/ViewArticle/78243/SAMANTA-OUT-RAKUL-IN/
08 Feb 2015

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top