అతి తక్కువ కాలంలో సంగీత దర్శకుడిగా 50 సినిమాలకు సంగీతాన్ని అందించి టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా పాపులారిటీ సంపాదించుకున్నాడు తమన్. స్టార్ యంగ్ హీరోలు మహేష్ అల్లుఅర్జున్ రవితేజా లాంటి ఎందరి సినిమాలకో మంచి ట్యూన్స్ అందించి బాగ పాపులర్ అయ్యాడు తమన్.
అయితే తమన్ కు ఎంత స్పీడ్ గా పేరు వచ్చిందో అంత స్పీడ్ గా అతని సంగీత దర్శకత్వ ప్రతిభ పై నెగిటివ్ కామెంట్స్ కూడ వచ్చాయి. తమన్ ఇస్తున్న ట్యూన్స్ అన్నీ ఒకేలా ఉంటున్నాయని చాల మంది దర్శక నిర్మాతలు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. ఈ వార్తల నేపధ్యంలో సందీప్ కిషన్ హీరోగా త్వరలో విడుదల కాబోతున్న ‘టైగర్’ సినిమా కోసం తమన్ ఇచ్చిన పాటల ట్యూన్స్ కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘కత్తి’ సినిమాలోని పాటలని అనుకరించాడు అనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి.
కత్తి సినిమాకు అనిరుధ్ సంగీత దర్శకుడిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ మధ్యనే జరిగిన ‘టైగర్’ పాటల ఆడియో ఫంక్షన్ లో ఈ కామెంట్లు చాలామంది చేసారని టాక్. ఏది ఎలా ఉన్నా అనేక మంది యువ సంగీత దర్శకులు రాకెట్ లా స్పీడ్ గా దూసుకు వస్తున్న నేపధ్యంలో తమన్ పై వస్తున్న ఈ కాపీ వివాదాలు అతడి కెరియర్ కు మంచిది కాదని చాల మంది విశ్లేషిస్తున్నారు.
అక్కినేని అఖిల్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న తొలి సినిమాకు తమన్ సందీప్ కిషన్ తో కలిసి సంగీత దర్శకత్వం చేయబోతున్న నేపధ్యంలో తమన్ తన పై వస్తున్న విమర్శకులకు సమాధానం ఇచ్చే స్థాయిలో మంచి ఒరిజినల్ ట్యూన్స్ ఇస్తాడేమో చూడాలి.
source:http://www.apherald.com/Movies/ViewArticle/79504/TAMMAN-CONTROVERSY-IN-TIGER-/

0 comments:
Post a Comment