'నేనింకా చిన్న పిల్లనే' అని ఆమె చెప్పడం కాదు, ఆమెని చూస్తే ఎవరైనా 'చిన్న పిల్ల' అనుకోవాల్సిందే. అలా ఉంటుంది బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' మూవీతో యంగ్‌స్టర్స్ గుండెల్లో బాంబులు పేల్చిన ఈ చిన్నది, బాయ్‌ఫ్రెండ్స్‌ని మెయిన్‌టెయిన్ చేయడంలోనూ దిట్టేనట. ఎంతైనా 'భట్' ఫ్యామిలీ నుంచి వచ్చింది కదా. ఆ సెకలు ఉండాల్సిందే. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్‌తో ఎప్పుడూ పార్టీల్లో మునిగి తేలుతుందట అలియా భట్. అలాగని గాసిప్స్ వస్తోంటే, మొదట 'నాన్సెన్స్' అని లైట్‌గా తీసుకున్న అలియా భట్, ఏమనుకుందో, 'నాకు నలుగురు కాదు, ఇంకా ఎక్కువమంది బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారు. లిస్ట్ చాలా పెద్దదే ఉంది' అని కసురుకుంది.
'నా బాయ్‌ఫ్రెండ్స్ నా ఇష్టం' అంటూ ఘాటుగా సమాధానమిచ్చి, సీక్రెట్‌గా బాయ్‌ఫ్రెండ్స్‌తో తిరగాల్సిన ఖర్మ తనకు లేదని క్లారిటీ ఇచ్చింది. ఏదన్నా మూవీలో నటించేటప్పుడు కెమిస్ట్రీ కోసం ఆ హీరోతో క్లోజ్‌గా మూవ్ అయితే, పార్టీలకు వెళితే అతన్ని బాయ్‌ఫ్రెండ్ అనడం కరెక్ట్ కాదని చెప్పింది అలియా. ఒకేసారి సినీ ఇండస్ట్రీలో ముగ్గురు నలుగురు హీరోలు ఓ పార్టీలో కలుస్తుంటారనీ, అదేం తప్పు కాదని అంటోందీ పాల బుగ్గల పోరీ.
source: http://telugu.gulte.com/tmovienews/8536/I-Have-Many-Boy-Friends-Alia-Bhatt#sthash.IoGkVhC7.dpuf
0 comments:
Post a Comment