Menu

మంచు వారి అబ్బాయి మంచు మనోజ్ పెళ్ళి ఏర్పాట్లకు కౌంట్ డౌన్ మొదలు అయ్యింది. వచ్చే నెల మార్చి 4వ తారీఖున ఉదయం 10.30 నిమిషాలకు మనోజ్ నిశ్చితార్ధం వేడుకలను చాలా ఘనంగా జరపడానిక్ మోహన్ బాబు కుటుంబం అప్పుడే ఏర్పాట్లు ప్రారంభించింది అనే వార్తలు వస్తున్నాయి. నిశ్చితార్దానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను మోహన్ బాబు స్వయంగా అనేక మంది సినిమా, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులకు అందచేస్తూ ఉండటంతో ఈ నిశ్చితార్ధ వేడుకలే ఒక పెళ్ళిలా జరగబోతున్నాయని టాక్.

భాగ్య నగరంలోని ఒక ప్రముఖ హోటల్ లో ఈ ఫంక్షన్ జరగబోతోంది. ఈ నిశ్చితార్ధ వేడుకకు ముందు మోహన్ బాబు ఇంట్లో ఒక ప్రత్యేక పూజ మంచు మనోజ్ భవిష్యత్ కోసం నిర్వహించే ఏర్పాట్లను కూడా చేస్తున్నారట. బిట్స్ పిలానిలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన ప్రణితి మంచు మనోజ్ ను ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్ళి చేసుకుంటున్న విషయం తెలిసిందే.

ఈ వార్తలు ఇలా ఉండగా గత సంవత్సరం విడుదలై పరాజయం పొందిన ‘కరెంటు తీగ’ దర్శకుడు నాగేశ్వరరెడ్డికి మరో అవకాశం ఇస్తూ మనోజ్ సినిమాను త్వరలో మొదలు పెడుతున్నాడని టాక్. ఇద్దరు హీరోయిన్స్ నటించే ఈ సినిమాను మనోజ్ అన్న హీరో విష్ణు నిర్మిస్తున్నాడు.

ఈ నిశ్చితార్ధం వేడుకల తరువాత మొదలు కాబోతున్న సినిమా కావడంతో మనోజ్ మంచి జోష్ మీద ఉన్నట్లు టాక్. మార్చి నెల నుండి తెలుగు వారికి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతున్న నేపధ్యంలో ఈ మార్చి సెంటిమెంట్ మనోజ్ కు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి.

source:http://www.apherald.com/Movies/ViewArticle/78627/MARCH-SENTIMENT-FOR-MANOJ-MARRAIGE/

0 comments:

Post a Comment

 
Top