Menu

రామ్ చరణ్ కు కథ చెప్పి ఒప్పించడం కత్తిమీద సాములాంటిది అని అంటారు. అయితే 2010 లో రామ్ చరణ్ తో సినిమా మొదలు పెట్టి ఆకథ చరణ్ కు పూర్తిగా నచ్చక పోవడంతో ఆగిపోయిన ‘మెరుపు’ సినిమాను మళ్ళి ప్రారంభించడానికి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని వస్తున్న వార్తలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి.

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం గతంలో ఆగిపోయిన ‘మెరుపు’ సినిమా కధకు కొద్దిగా మార్పులు చేసి దర్శకుడు ధరణి చేసిన ప్రయత్మంలో చరణ్ పడిపోయాడు అని టాక్. గతంలో మొదలు పెట్టిన ఈ మెరుపు సినిమాలో చ‌ర‌ణ్ ఓ ఫుట్ బాల్ ప్లేయ‌ర్‌.

అందుకు సంబంధించిన కొన్ని స‌న్నివేశాల్ని కూడ గతంలో షూట్ చేసారు. ఇప్పుడు ఈ మార్చిన కధలో కుడా ఆ సన్నివేశాలను వాడుతారని టాక్. గతంలో అనేక బ్లాక్ బస్టర్ సినిమాలను కోలీవుడ్ లో తీసిన ఈ తమిళ దర్శకుడు ధరణి పవన్ కళ్యాణ్ తో ‘బంగారం’ సినిమాను తీసాడు.

అయితే ఈ సినిమా అప్పట్లో పవన్ అభిమానులను నిరాశ పరిచింది. పవన్ కు హిట్ ఇవ్వలేక పోయిన దర్శకుడు పై రామ్ చరణ్ అంత నమ్మకాన్ని పెట్టుకుని ఆగిపోయిన సినిమాను తిరిగి ప్రారంభించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం టాపిక్ అఫ్ టాలీవుడ్ గా మారాడమే కాకుండా చరణ్ నిర్ణయాలు ఎవరికీ అర్ధంకానివిగా మారుతున్నాయి అని అంటున్నారు.

source:http://www.apherald.com/MOVIES/ViewArticle/78636/DHARANI-INFLUENCE-ON-RAM-CHARAN-/

0 comments:

Post a Comment

 
Top