March 17, 2025 11:58:35 AM Menu
Latest

6:28 PM test1


కొన్ని పవర్ ఫుల్ టైటిల్స్ సినిమా మొదలు కాకుండానే చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఆ సినిమా కథ ఏమిటో తెలియకుండానే ఆ సినిమా పై అంచనాలను ఆ టైటిల్స్ పెంచేస్తూ ఉంటాయి. క్రియేటివ్ దర్శకుడు క్రిష్ మహేష్ బాబుతో ‘శివం’ సినిమాను తీయబోతున్నాడు అంటూ గత సంవత్సరం మీడియాలో చాల హడావిడి జరిగింది. ఈ కథ మహేష్ బాబుకు నచ్చింది అనే ప్రచారం కూడా జరిగింది.

అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఆ తరువాత ఈ సినిమాలో హీరోగా వరుణ్ తేజ్ నటిస్తాడు అనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ టైటిల్ ఎందరో హీరోల గడపలను దాటి ఫైనల్ గా రామ్ వద్దకు చేరడమే కాకుండా ఈ టైటిల్ తో ఈ సినిమా ఈరోజు ప్రారంభం కాబోతోంది.

ఈ సినిమాకు దర్శకుడు సురేంద్రరెడ్డి శిష్యుడు శ్రీనివాస రెడ్డి దర్శకత్వం వహించబోతున్నాడు. గతంలో నితిన్ తో ఒక సినిమాను ఈ దర్శకుడు తీస్తాడు అని ప్రచారం జరిగింది. అయితే నితిన్ స్థానంలో ఆ కథకు ఇప్పుడు రామ్ వచ్చి చేరాడు.

కథ క్రిష్ అనుకున్నది కాకపోయినా సినిమా టైటిల్ మాత్రం దర్శకుడు క్రిష్ అనుకున్న ‘శివం’ టైటిల్. ప్రస్తుతం హిట్ లేక సతమతమవుతున్న రామ్ కెరియర్ కు మంచి క్రేజ్ తో ఉన్న ఈ ‘శివం’ టైటిల్ ఎంత వరకు ఉపయోగ పడుతుందో చూడాలి.

source:http://www.apherald.com/Movies/ViewArticle/78264/MAHESH-TITLE-FOR-RAM/

09 Feb 2015

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top