Menu


పీకే రీమేక్‌లో కమల్ హాసన్.. గత 24 గంటలుగా సౌత్ ఇండియాలో సంచలనంగా నిలుస్తున్న వార్త. దర్శకుడెవరు, నిర్మాత ఎవరు, హీరోయిన్ ఎవరు అన్నది వెల్లడి కాలేదు కానీ.. కమల్ హాసన్ పీకే పాత్రను పోషిస్తున్నాడన్న వార్త మాత్రం జోరుగా పాకిపోతోంది. ఐతే దీని గురించి అధికారిక వార్త మాత్రం లేదు. అసలు పీకే రీమేక్ హక్కులు కొన్నదెవరు అన్నది కూడా తెలియరావడం లేదు. కానీ వెబ్ మీడియా, టీవీ ఛానెళ్లు మాత్రం పీకే పాత్రలో కమల్ హాసన్‌ను ఊహించేస్తూ కథలు పుట్టించేస్తున్నాయి. కాస్త ఆలోచించి చూస్తే మాత్రం పీకే రీమేక్‌లో కమల్ హాసన్ నటించే అవకాశాలు తక్కువే అని అర్థం చేసుకోవచ్చు.

సాధారణంగా కమల్ హాసన్ రీమేకులకు దూరం. ఆయన రీమేక్‌లు చేసినపుడు ఆ ప్రయత్నాలు పెద్దగా ఫలించింది కూడా లేదు. వసూల్ రాజా ఎంబీబీఎస్ ఓ మాదిరిగా ఆడగా.. ఈనాడు ఫ్లాప్ అయింది. కమల్ కొంచెం సాధారణంగా ఉండే పాత్రల్ని మరింత ఇంప్రొవైజ్ చేయడానికి ప్రయత్నిస్తారు తప్పిస్తే.. ఆల్రెడీ ఓ ప్రత్యేకత సంతరించుకున్న పాత్రల్ని చేయడానికి మొగ్గు చూపరు. ఆ రకంగా చూస్తే పీకే పాత్ర కోసం అమీర్ ఖాన్ ఏమేం చేశాడో.. ఎంత వైవిధ్యం ప్రదర్శించాడో తెలిసిందే. ఇలాంటి పాత్రను కమల్‌కు ఇవ్వడం సమంజసం అనిపించుకోదు. ఓ లెజెండ్‌ పోషించిన పాత్రను ఇంకో లెజెండ్ పోషించడం చాలా కష్టం. అలాంటి ప్రయత్నాలకు ఎవరూ పోరు. కాబట్టి పీకే రీమేక్‌లో కమల్ నటించడం అన్నది ప్రస్తుతానికి పుకారుగానే భావించాలి. 


source: http://telugu.gulte.com/tmovienews/8537/Kamal-haasan-to-do-PK-remake#sthash.dLhV8R2Q.dpuf

0 comments:

Post a Comment

 
Top