అయితే మా మధ్య ఎలాంటి విబేధాలు రాలేదనేది మాత్రం వాస్తవం. కొందరు మాపై రూమర్స్ ప్రచారం చేయడం ద్వారా నాకు, ఎన్టీఆర్ మధ్య గొడవలు పెట్టాలని ట్రైచేసారు. ఎందుకంటే నేను మెగా క్యాంపు నిర్మాతగా ముద్రపడ్డ వ్యక్తికాబట్టే ఇలా చేసారు. కానీ నేను ఎవరితో పని చేస్తే వారి క్యాంపు నిర్మాతను అయిపోతాను.
నాకు అందరి హీరోలతో మంచి స్నేహబంధం ఉంది, అందరితో పని చేయాలని కోరుకుంటాను. నేను తీసిని ప్రతి చిత్రం బ్లాక్ బస్టర్ కావాలని, చూసిన ప్రేక్షకులు సంతోషంగా ఇంటికి వెళ్లాలని కోరుకుంటాను అన్నారు. నాకు పవన్ కళ్యాణ్ దేవుడు లాంటి వారు. నిర్మాతగా నాకు బ్రేక్ ఇచ్చిన వ్యక్తి. ఆయనతో తీసిన నా సినిమా ప్లాపయిన తర్వాత నన్ను పలిపిచి మరీ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. నా తల్లిదండ్రుల తర్వాత నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పుకొచ్చారు" గణేష్.
టెంపర్ సినిమా విషయంలో ప్రసాద్ వి పొట్లూరి చేసిన సహాయం గురించి గణేష్ స్పందిస్తూ..."పివిపిగారు నాకు పెద్దన్నయ్య లాంటి వారు. టెంపర్ సినిమాకు బయ్యర్లు తక్కువ రేటు ఇస్తానన్నపుడు డైరెక్టుగా రిలీజ్ చేద్దామని నిర్ణయించుకున్నాను. ఆయన చాలా సహాయం చేసారు. బయ్యర్లు కేవలం 8 కోట్లకే టెంపర్ రైట్స్ అడిగారు. అందుకు నేను ఒప్పుకోలేదు. ఇపుడు సినిమా బాగా ఆడుతుంది. ఎన్టీఆర్ గత సినిమా రామయ్యా వస్తావయ్యా సరిగా ఆడలేదు. ఎన్టీఆర్-పూరి కాబినేషన్లో వచ్చిన ఆంధ్రవాలా కూడా యావరేజ్. అందుకే బయ్యర్లు తక్కువ అమౌంట్ కోట్ చేసి ఉంటారు" అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.
source:http://www.apherald.com/Movies/ViewArticle/78912/Bandla-ganesh-tollywood-telugu-films-temper-poori-/
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.