Menu


ఏదోఒక వివాదంతో వార్తలో ఉండాలని ఆశించే లక్ష్మిరాయ్ ఈసారి ప్రేమికుల రోజును అందుకు వాడుకున్నారు. ఆమె ఒక గుడ్ న్యూస్.. లవర్స్ డే సందర్భంగా నేను ఎట్టకేలకు ఒక ప్రేమికుడిని కనుగొన్నాను అంటూ తన ట్విట్టర్లో పోస్ట్ చేసి ఆమె అభిమానులకు షాక్ ఇచ్చారు. కాసేపట్లోనే హా..హా…హా బాగా బాధపడ్డారా? చాలామంది గుండెల్ని రగిలించానా? అంటూ మరోసారి తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

దీంతో ఏంటి లక్ష్మిరాయ్ ఇలా ప్రవర్తిస్తుంది? ఆమెకేమైంది? అంటూ చర్చించడం మొదలెట్టారు. ఈ అమ్మడికిప్పుడు అవకాశాలు అంతగా లేవు. ముందు అనూహ్యంగా ప్రేమికుడి గురించి నోరు జారి ఆ తరువాత అసలు అవకాశాలు లేకుండా పోతాయేమోనని ఆలోచనలో పడి తను ఈ వ్యాఖ్యల్ని చేయాలనుకున్నారా? లాంటి పలు రకాల చర్చలు రాయ్లక్ష్మిపై కోలీవుడ్‌లో సాగుతున్నాయి.

source:http://www.apherald.com/Movies/ViewArticle/78905/Laxmirai-Love-Affair-Tollywood-News-Tollywood-hero/

0 comments:

Post a Comment

 
Top