అత్యంత భారీ అంచనాలతో విడుదల అయిన గోపాల గోపాల, 'ఐ' సినిమాలలో ఏ రెండిటికి సూపర్ హిట్ టాక్ రాకపోవడంతో ఈ సినిమాల ఘన విజయం పై ఆసలు పెట్టుకున్న ఆ సినిమా హీరోల అభిమానులతో పాటు ఆ సినిమాలను అత్యంత భారీ మొత్తాలకు కొనుక్కున్న బయ్యర్లు సంక్రాంతి తరువాత ఈ సినిమాల పరిస్థితి ఏమిటి అని అప్పుడే లెక్కలు వేసుకుంటున్నారని టాక్ . ఈ రెండు సినిమాలకు లాభాల మాట అటువుంచి నష్టాలు రాకుండా అయినా ఈ సినిమా బయ్యర్లు గట్టు ఎక్కుతారా అన్నదే ప్రశ్న ఈపరిస్థితులను చూస్తున్న జూనియర్ అభిమానులు మాత్రం తమ అభిమాన హీరో ఎన్టీఆర్ సంక్రాంతికి 'టెంపర్' తీసుకువచ్చే ఉంటే ఊహించని హిట్ కొట్టి ఉండేవాడని కాని దురదృష్టం అనుకోని అవాంతరాలుగా మారి తమ హీరోకు గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసిందని తెగ బాధ పడుతున్నట్లు టాక్. అంతే కాదు సంక్రాంతికి విడుదల కాకపోవడం మాత్రం 'టెంపర్' కి చాలా పెద్ద లాసే అనే భావనతో సంక్రాంతిని చాలా భారంగా జూనియర్ అభిమానులు జరుపుకుంటున్నారని తెలుస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల అయినా ఇంతటి గోల్డెన్ ఛాన్స్ మళ్ళి వస్తుందా అంటూ లెక్కలు వేసుకుంటున్నారట. ఈ పరిస్థితులలో తన అభిమానుల భాదను జూనియర్ ఏవిదంగా తన 'టెంపర్' ద్వారా మరిపిస్తాడో చూడాలి.
source:http://www.apherald.com/Movies/ViewArticle/76273/JUNIOR-FANS-GETTING-TENSION/
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.