కొంత కాలంగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హై ఎక్స్ పెక్టేషన్స్ వచ్చిన భారీ బడ్జెట్ మూవీలు అన్నీ ధారుణంగా ప్లాప్ అవుతున్నాయి. గత నెలలో వచ్చిన రజనీకాంత్ ‘లింగా' చిత్రంపై ఆడియన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో సినిమా విఫలం అయింది. ఇది భారీ బడ్జెట్ చిత్రం కావడంతో బాక్సాఫీసు వద్ద నష్టాలను చవి చూసింది. తాజాగా శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కిన ‘ఐ' చిత్రం సినిమాపై పెట్టుకున్న భారీ అంచనాలను అందుకోలేక పోయింది. తొలి రోజే సినిమాపై నెగెటివ్ టాక్ వచ్చింది. అంతే కాకుండా ఐ మూవీకి 7 కోట్ల రూపాయల నష్టం వాటిల్లడం ఖాయం అంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు షురూ అవుతున్నాయి.
ఈ రెండు మూవీలు అరవ మూవీలకి డబ్బింగ్ చిత్రాలే కావడం విశేషం. ఇదిలా ఉంటే, వీటి ఎఫెక్ట్ తెలుగు సినిమాలపై పడింది. దీంతో బడా డైరెక్టర్స్ అయిన రాజమౌళి, గుణశేఖర్ లు వణికిపోతున్నారు. దీంతో త్వరలో తెలుగు రాబోతున్న రెండు భారీ బడ్జెట్ చిత్రాలపై అంచనాలను వీలైనంతగా తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నరు ప్రేక్షకులు. ఎలాంటి అంచనాలు, ఊహలు లేకుండా సినిమాకు వెళితేనే బావుంటుందని సినిమా ప్రియులు భావిస్తున్నారు.
గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘రుద్రమదేవి' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ‘బాహుబలి' చిత్రం కూడా విడుదల కాబోతోంది. భారీ పబ్లిసిటితో వచ్చిన లింగ, ఐ మూవీలు ఘోరంగా వైఫల్యం చెందటంతో, వీరు బాహుబలి, రుధ్రమదేవి మూవీలకి పబ్లిసిటీ విషయంలో ఓవర్ చేయకుడదని నిర్ణయించుకున్నారంట.
source:http://www.apherald.com/MOVIES/ViewArticle/76343/Rajamouli-gunashekhar-tollywood-telugu-films-I-mov/
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.