March 18, 2025 05:00:48 AM Menu
Latest

6:28 PM test1

ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న మూవీ శ్రీమంతుడు. కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ షూటింగ్, శరవేగంగా జరుపుకుంటుంది. అంతే కాకుండా ఈ మూవీని వేసవి కానుకగా రిలీజ్ చేయటానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ న్యూస్ హాట్ టాపిక్ గా వినిపిస్తుంది. ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న అప్ కమింగ్ మూవీలో సన్నిలియోన్ ఉందంటూ ఇండస్ట్రీ సమాచారంగా తెలుస్తుంది.

వివరాల్లోకి వెళితే, ప్రిన్స్ నటిస్తున్న శ్రీమంతుడు మూవీలో ఓ స్పెషల్ సాంగ్ కోసం సన్నిలియోన్ ని చిత్ర యూనిట్ అప్రోచ్ అయిందట. అందుకు సన్నిలియోన్ కూడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరిపై స్పెషల్ సాంగ్ ని ఫిబ్రవరి మూడో వారంలో చిత్రికరించేందుకు ముహుర్తం పెట్టినట్టు సమాచారం. గతంలో సన్నిలియోన్, కరెంట్ తీగ మూవీలో మంచు మనోజ్ సరసన చిందేసింది. ఇప్పుడు ఏకంగా ప్రిన్స్ మహేష్ బాబు మూవీలోనే దర్శనమిస్తుంది.

కొరటాల శివ మొదట ఈ విషయాన్ని ప్రిన్స్ మహేష్ బాబుతో చెప్పగా అందకు నో చెప్పాడంట. కాని తరువాత కన్విన్స్ చేయగా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. పబ్ లో సాగే ఈ సాంగ్, మూవీలో చాలా కీలకంగా ఉంటుందట. అందుకే ఈ స్పెషల్ సాంగ్ లో సన్నిలియోన్ ని తీసుకుంటున్నట్టుగా చిత్ర యూనిట్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా సన్నిలియోన్ సరసన ప్రిన్స్ చిందులేస్తుంటే ఎలా ఉంటుందనేదానిపై సినీ ప్రేక్షకులు ఇప్పటి నుండే రకరకాలుగా ఊహించుకుంటున్నారు.

source:http://www.apherald.com/Movies/ViewArticle/77163/Maheshbabu-tollywood-sreemanthudu-telugu-films-sna/ 
27 Jan 2015

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top