త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో అల్లుఅర్జున్ నటిస్తున్న సినిమా టైటిల్ కు సంబంధించి ఆమధ్య ‘త్రిశూలం’ అన్న టైటిల్ పెడుతున్నారు అనే వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు గాసిప్పులుగానే మిగిలిపోయాయి. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను మొదట్లో ఫిబ్రవరిలో విడుదల చేద్దామని అనుకున్నా అనుకోని కారణాల రీత్యా ఈసినిమా విడుదల ఇప్పుడు మార్చి నెలాఖరుకు వాయిదా పడింది. అయితే ఈసినిమాకు సంబంధించి రెండు అశక్తికర టైటిల్స్ ఇప్పుడు ప్రచారంలోకి వచ్చాయి. ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాకు ‘జాదుగర్’, ‘హుషారు’ అనే టైటిల్స్ పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన దర్శకుడు త్రివిక్రమ్ కు వచ్చింది అనే ప్రచారం జరుగుతోంది.
అయితే చాలామంది యూనిట్ సభ్యులు ఈ సినిమాకు ‘జాదుగర్’ టైటిల్ కు ఓటు వేస్తూ ఉంటే బన్నీ మాత్రం ‘హుషారు’ టైటిల్ పై మోజుపడుతున్నాడని టాక్. తన బాడీ లాంగ్వేజ్ తో హుషారైన స్టెప్స్ తో వెండి తెరపై మాయచేయడం అల్లుఅర్జున్ కు వెన్నతో పెట్టిన విద్య కాబట్టి ఈసినిమాకు ‘జాదుగర్’ అనే టైటిల్ బాగుంటుందని బన్నీ అభిమానులు కూడా ఫీల్ అవుతున్నట్లు టాక్. గతసంవత్సరం హీరో ఆఫ్ ది ఇయర్ గా ‘రేసు గుర్రం’ సక్సస్ తో మంచి స్పీడ్ మీద ఉన్న అలుఅర్జున్ ప్రస్తుతం నటిస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా పై చాల ఆశలే పెట్టుకున్నాడు.
source:http://www.apherald.com/Movies/ViewArticle/76495/BANNY-BECOMING-JAADUGAR/
0 comments:
Post a Comment