గత కొంత కాలంగా టాలీవుడ్, కోలీవుడ్ సినిమా రంగాలలో భారీ సినిమాలకు తగులుతున్న ఎదురు దెబ్బల ప్రభావం ‘బాహుబలి’ మార్కెట్ పై స్పష్టంగా కనిపిస్తోంది అనే వార్తల హడావిడి ఫిలింనగర్ లో హల్ చల్ చేస్తోంది. ఈసినిమాను రెండుభాగాలలో నిర్మిస్తున్న రాజమౌళి మొదటి భాగం నిర్మాణం పూర్తి చేసి రెండవభాగం నిర్మాణం పై దృష్టి పెట్టాడు అనేవార్తలు వినపడుతున్నాయి. ఈసినిమా రెండవ భాగానికి సంబంధించి ఇంకా సగం పైగా షూటింగ్ మిగిలి ఉండటంతో మిగిలిన ఆసగ భాగాన్ని పూర్తి చేయడానికి ఈసినిమా నిర్మాతలకు ‘బాహుబలి’ మొదటి భాగానికి పెట్టిన అత్యధిక ఖర్చు వల్ల ఆర్ధికసమస్యలు ఏర్పడ్డాయి అనే గాసిప్పులు వినపడుతున్నాయి.
దీనితో ‘బాహుబలి’ మొదటి భాగం విడుదల తేదీని ప్రకటించి ఆసినిమా మొదటి భాగం బిజినెస్ ను కనీసం 100 కోట్ల వరకు అయినా చేద్దామని ఈసినిమా నిర్మాతలు అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నా వీరి అంచనాలకు తగ్గట్టుగా బయ్యర్ల నుండి ఆఫర్లు రావడంలేదని టాక్. దీనితో ఈ సినిమా మార్కెట్ విషయమై క్రేజ్ పెంచడానికి ఈసినిమాను కొన్ని ఏరియాలకు సంబంధించి అత్యధిక రేట్లతో కొందరు బయ్యర్లు కొనుక్కున్నారు అని ప్రచారం చేపట్టిన్నా ఆ వార్తల హడావిడి ‘బాహుబలి’ బయ్యర్ల రేటును పెంచే స్థాయిలో ప్రభావితం చేయలేదు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈసినిమా రెండవ భాగాన్ని తొందరగా పూర్తి చేసి తనను ఈ పాత్ర నుండి పూర్తిగా విముక్తి చేయవలసిందిగా ప్రభాస్ పదేపదే రాజమౌళి పై ఒత్తిడి పెంచుతూ ఉండటంతో ఒకవైపు ‘బాహుబలి’ మార్కెట్ అనుకున్న స్థాయిలో జరగక పోవడం మరొక వైపు ఈసినిమా రెండవ భాగo సినిమా షూటింగ్ అనుకున్న టైంకు పూర్తి కాకపోవడం రాజమౌళిని టెన్షన్ పెడుతున్నాయి అని టాక్.
source:http://www.apherald.com/Movies/ViewArticle/76468/RAJAMOULI-IN-BAHUBALI-PROBLEMS-/
0 comments:
Post a Comment