Menu

jr-ntr-ram-charan

స్టార్‌ డైరెక్టర్లు అందరూ టాప్‌ హీరోలు అందరితోను సినిమాలు చేయడానికే మొగ్గు చూపుతారు. కానీ త్రివిక్రమ్‌ మాత్రం ఎప్పుడూ తనతో ఫ్రెండ్లీ రిలేషన్‌ ఉన్న హీరోలనే ఎంచుకుంటున్నాడు. ఎన్టీఆర్‌, చరణ్‌ ఇద్దరూ ఇప్పటికే పలుమార్లు త్రివిక్రమ్‌ని కలిసి అతనితో పని చేయాలనే కోరిక వెలిబుచ్చారు. ఈ కాంబినేషన్‌లో సినిమా నిర్మించడానికి నిర్మాతలు కూడా ఉన్నారు. కొందరు త్రివిక్రమ్‌కి అడ్వాన్స్‌ కూడా చెల్లించారు. 

కానీ త్రివిక్రమ్‌ మాత్రం ఎప్పుడూ పవన్‌, మహేష్‌ చుట్టే తిరుగుతున్నాడు. వారు కాకపోతే మధ్యలో ఒకసారి అల్లు అర్జున్‌తో సినిమా చేస్తున్నాడు. మరి తనతో వర్క్‌ చేయడానికి రెడీగా ఉన్న ఎన్టీఆర్‌, చరణ్‌ హీరోలు కాదా? లేదా వారితో తన తరహా సినిమా తీసే అవకాశమే లేదని త్రివిక్రమ్‌ భావిస్తున్నాడా? ఇప్పటికే పలుమార్లు ఈ హీరోలని హర్ట్‌ చేసిన త్రివిక్రమ్‌ మళ్లీ తన మలి చిత్రం మహేష్‌తో చేయడానికి ఫిక్స్‌ అయి ఇంకోసారి చరణ్‌, తారక్‌ ఈగో హర్ట్‌ చేసాడు. ఇలా వారిని హర్ట్‌ చేస్తూ పోతే ఇక తనతో పని చేయాలనే ఐడియానే డ్రాప్‌ అయిపోతారనేది అతని ఉద్దేశమో లేక తన దృష్టిలో మహేష్‌, పవన్‌, బన్నీ తప్ప మిగతావాళ్లు హీరోలు కారనో?

source:http://telugu.gulte.com/tmovienews/8471/Trivikram-not-willing-to-do-with-NTR-and-Charan

0 comments:

Post a Comment

 
Top