టాలీవుడ్ సినిమా రంగంలో రాజశేఖర్ పూర్తి గా వెనుక పడి పోవడానికి చాలా కారణాలు వినిపిస్తాయి. టాలీవుడ్ యాంగ్రీ హీరోగా ఒకప్పడు ఒక వెలుగు వెలిగిన రాజశేఖర్ కు మెగాస్టార్ చిరంజీవికి పడదు అనేది ఓపెన్ సీక్రెట్.మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘ఠాగూర్’ సినిమాను తెలుగులో రీమేక్ చేసే విషయంలో చిరంజీవి స్పీడ్ ను అందుకోలేక పోవడంతో చిరూతో ఏర్పడ్డ భేదాభిప్రాయాలు పవన్ కళ్యాణ్ కు బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘గబ్బర్ సింగ్’ ఈదూరాన్ని మరింత పెంచిందని లేటెస్ట్ గా కొంతమంది బయటకు తీసారు.
ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తలప్రకారం రాజశేఖర్ తన కెరియర్ నిలబెట్టుకోవడానికి బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘దబాంగ్’ ను తెలుగులో రీమేక్ చేయాలని ముంబాయి వెళ్ళి ఆ సినిమా నిర్మాతలతో మాట్లాడి 1.35 కోట్లు ఆఫర్ చేసాడు అని టాక్.
కానీ ఈలోపునే నిర్మాత బండ్ల గణేష్ ఈసినిమా రీమేక్ రైట్స్ కోసం ఏకంగా 1.75 కోట్లు ఆఫర్ చేయడంతో ఆసినిమా నిర్మాతలు బండ్లగణేష్ వైపు వెళ్ళిపోయారు అని టాక్. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న రాజశేఖర్ ఇక్కడ కూడా తన ఎదుగుదలకు మెగాఫ్యామిలీ అడ్డు తగిలిందని తెగకోపం పెంచుకున్నాడట.
మారిన పరిస్థుతుల నేపధ్యంలో ప్రస్తుతం రాజశేఖర్ చిరంజీవితో స్నేహ బంధాన్ని పెంచుకోవాలని ఆశ పడుతున్నట్లు మీడియా ఇంటర్వ్యూలలో చెపుతున్నాడు. దీనివల్ల రాజశేఖర్ కు కొత్తగా వచ్చే ప్రయోజనం ఏమిటో తెలియకపోయినా రేపు విడుదల అవుతున్న ‘గడ్డం గ్యాంగ్’ కనీస విజయం రాజశేఖర్ కు అత్యంత కీలకంగామారింది.
0 comments:
Post a Comment