Menu

trisha-krishnan-hot.jpg

కోలీవుడ్ హీరోయిన్ త్రిషను ఆమె కాబోయే భర్త వరుణ్‌ని టార్గెట్ చేస్తూ బెదిరింపు కాల్స్ వస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియక పోయినా తనకు వస్తున్న ఈ బెదిరింపుల వల్ల త్రిష భయపడి పోతోంది అని టాక్.

ఇక వివరాలలోకి వెళితే ఈమధ్యనే పెళ్ళి యంగేజ్ మెంట్ జరిగిన ఈ జంట ఐపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ కు సంబంధించి చెన్నైకి చెందిన చెన్నై సూపర్‌కింగ్స్ టీమ్‌ని కొనుగోలు చేస్తున్నారంటూ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. అయితే అలాంటి ఆలోచన తమకు లేదని త్రిష భర్త వరుణ్ క్లారిటీ ఇచ్చాడు.

అయినా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ను కొంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వరుణ్ పై ఇప్పటికీ బెదిరింపు కాల్స్ వస్తున్నట్లుగా కోలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. కేవలం నాలుగైదు గంటల్లో దాదాపు ఐదు కాల్స్ రావడంతో ఒత్తిడికి గురైన వరుణ్‌మణియన్ నిన్న చెన్నైలోని తేనాంపేటలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు అని మీడియా టాక్.

ప్రేమించుకుని ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించుకుని పెళ్ళి పనులలో బిజీగా ఉన్న తమకు ఈ టెన్షన్ ఏమిటీ అని త్రిష టెన్షన్ పడుతున్నట్లు టాక్. ఈ వార్తలను బట్టి సినిమా తారలకు కూడా ఐపిఎల్ క్రికెట్ వివాదాలు ఎలా టెన్షన్ పెడుతున్నాయో అర్ధం అవుతుంది.

SOURCE:http://www.apherald.com/Movies/ViewArticle/77712/THREATENING-CALLS-TO-TRIASHA-/

0 comments:

Post a Comment

 
Top