రజినీకాంత్ ‘లింగ’ ఘోర పరాజయం చెందినా రజినీకాంత్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా ఏ విధంగా ఉందో తెలియచెప్పే విషయం ఒకటి కోలీవుడ్ మీడియాలో ప్రచారంలో ఉంది. ఆ మీడియా రాస్తున్న వార్తల ప్రకారం రజినీకాంత్ తన అభిమానుల కోసం ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఇందుకోసం 300 కోట్లతో నిధి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
ఈ నిధులతో సినిమాలు తీసి వచ్చిన లాభాలను అభిమానుల సంక్షేమ నిధికి మళ్లించనున్నాడని టాక్. దీనికోసం ప్రపంచ వ్యాప్తంగా రజనీకాంత్ తో పరిచయాలు ఉన్న కొంతమంది ప్రముఖ వ్యక్తులతో రజినీకాంత్ ఇప్పటికే మాటలు ప్రారంభించాడని టాక్. అయితే ఈ ఆలోచన వెనుక రజినీకాంత్ పక్కా వ్యూహాత్మక ఎత్తుగడ ఉంది అని అంటున్నారు.
వచ్చే సంవత్సరం తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్న నేపధ్యంలో తన అభిమానుల పై అదేవిధంగా అభిమాన సంఘాల పై మరింత పట్టును పెంచుకోవడానికి రజినీకాంత్ ఈ కొత్త వ్యూహాన్ని రచించినట్లు చెపుతున్నారు. భారతదేశంలో ఇప్పటి వరకు ఏ టాప్ హీరో కూడా ఈ స్థాయిలో ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి అభిమానులకు లాభాలను పంచడానికి సినిమాలను తీసిన సందర్భాలు లేవు.
కానీ ప్రస్తుతం రజినీకాంత్ అటువంటి ఆలోచనలు చేస్తూ ఉండటంతో ఇప్పుడు ఈ విషయం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి రజినీకాంత్ ఆలోచనలు ఎంత వరకు విజయవంతం అవుతాయో చూడాలి.
source:http://www.apherald.com/Movies/ViewArticle/78780/RAJANIKANTH-300-CRORES-MASTERPLAN/
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.