చిరంజీవి తనయుడిగా టాలీవుడ్ టాప్ హీరోల రేసులో ముందు స్థానంలో ఉన్న రామ్ చరణ్ పై నటుడు జీవ చేసిన కామెంట్స్ టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారాయి. గతవారం విడుదలైన ‘లేడీస్ అండ్ జంటిల్ మెన్’ సినిమాలో ఒక రౌడీ పాత్రను పోషించాడు జీవ. ఈ సినిమాలో ఒకచోట రామ్ చరణ్ చేసిన ‘బంగారు కోడి పెట్ట’ పాటను చూసి ‘ఏమైనా చెప్పండిరా భాయ్, వీళ్ళ నాన్న వేసే స్టెప్స్ ముందు ఇవెంత’ అని అంటాడు.
అప్పటి దాకా మౌనంగా సినిమాను చూస్తున్న ప్రేక్షకులు చిరంజీవి పేరు వినగానే చైతన్యం పొందుతారు. అంతేకాదు ఇదే సీన్ లో ‘అవును చిరంజీవి 150 వ సినిమా ఎప్పుడోస్తుందిరా’ అంటూ కామెంట్లు కూడా చేస్తాడు. దీనితో చిరంజీవి పేరును జీవ పాత్ర ద్వారా ఈ సినిమా దర్శక నిర్మాతలు బాగా వాడుకున్నారు అని ఈ సినిమా చూసిన వారికి అనిపిస్తుంది.
జీవ కామెంట్స్ ఎలా ఉన్నా గత శుక్రువారం విడుదలైన ఈ సినిమాకు మీడియా సపోర్ట్ ద్వారా మంచి క్రేజ్ వచ్చిన నేపధ్యంలో ఈ సినిమాకు అమెరికాలోని తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాకు కోస్తా, రాయలసీమ ప్రాంతంలోని పట్టణాలలో కలెక్షన్స్ విషయంలో చెప్పుకోతగ్గ ఫలితం రావడం లేదని టాలీవుడ్ టాక్.
కలెక్షన్స్ స్థాయి ఎలా ఉన్నా ప్రస్తుతం యూత్ విపరీతంగా కనెక్ట్ అయిపోతున్న వెబ్ ప్రపంచం వారి విలువైన జీవితాలను ఎలా నాశనం చేస్తోందో చెప్పే మంచి సందేశంతో కూడిన మంచి సినిమాగా మాత్రం ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది.
0 comments:
Post a Comment