Menu


'బట్టల్తో చంపేయ్‌గలవ్‌ తెల్సా?' అంటూ బ్రహ్మానందం ఫ్యాషన్‌ సెన్స్‌పై జోకేస్తాడు మహేష్‌బాబు. అప్పట్నుంచి భయంకరమైన బట్టలేసుకుని జనాన్ని క్షోభ పెట్టే వారి గురించి ఇదే జోక్‌ వేసుకోవడం కామన్‌ అయిపోయింది. సెలబ్రిటీస్‌లో కొందరి వియర్డ్‌ ఫ్యాషన్‌ సెన్స్‌ ఉంటుంది. కొత్తగా కనిపించాలనే ఆరాటంతో ఫ్యాషన్‌ వెర్రి తలలు వేసేయడం జరుగుతుంది. దానికి తోడు వారి పర్సనల్‌ డిజైనర్లు కూడా వీరి వెర్రి ఫ్యాషన్‌ సెన్స్‌ని గుర్తిస్తే ఇక జనాలు చచ్చారన్నమాటే. ఇప్పటికే పలు వేడుకలకి పిచ్చి పిచ్చి డ్రస్‌లు వేసుకుని వచ్చిన సమంత ఇప్పటికీ తనది భయంకరమైన ఫ్యాషన్‌ సెన్స్‌ అని గుర్తించనే లేదు. 

తనేదో చాలా బాగా తయారై వచ్చేస్తున్నట్టు, తన డిజైనర్లు తనని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నట్టు ఫీల్‌ అయిపోతుంటుంది. తన ఫాలోవర్స్‌లో ఎక్కువ మంది ఫాన్స్‌ ఉండడం వల్ల అసలు రియాక్షన్‌ ఏంటనేది సమంతకి చేరుతున్నట్టు లేదు. దీంతో ఆమె నానాటికీ మరీ దారుణమైన దుస్తుల్లో దర్శనమిస్తూ భయకంపితుల్ని చేస్తోంది. రాజేంద్రప్రసాద్‌ కొడుకు పెళ్లికి సమంత ఇదిగో ఇలా రెడీ అయి వచ్చింది. ఫోటోలో చూడ్డానికే ఇలాగుంటే... దగ్గర్నుంచి చూసిన వాళ్లు, ముఖ్యంగా వధూవరులు ఏమైపోయుంటారో మీరే ఊహించుకోండి. 



source: http://telugu.gulte.com/tmovienews/8556/Samantha-dress-at-Rajendra-prasad-son-wedding#sthash.k2mE6aHu.dpuf

0 comments:

Post a Comment

 
Top