దర్శకుడు రాజమౌళికి జూనియర్ కు ఉన్న స్నేహబంధం గురించి కొత్తగా వివరించనవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే మూడు సూపర్ హిట్ సినిమాలు వచ్చి జూనియర్ ను టాప్ హీరోగా మార్చాయి. జూనియర్ కు కూడా రాజమౌళి అంటే విపరీతమైన ఇష్టమే కాకుండా జక్కన్న అని ముద్దుగా రాజమౌళిని పిలుస్తూ ఉంటాడు యంగ్ టైగర్. ఇక మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రాజమౌళి కొడుకు కార్తికేయకు జూనియర్ అంటే విపరీతమైన అభిమానం.
అంతేకాదు జూనియర్ అభిమానులకు తరుచు టచ్ లో ఉంటూ వారు చెప్పే విషయాలను జూనియర్ కు చేరవేస్తూ ఉంటాడు కార్తికేయ. ఈ నేపధ్యంలో ఈ వారం 13వ తారీఖు నాడు విడుదల కాబోతున్న ‘టెంపర్’ సినిమాకు సంబంధించి జూనియర్ అభిమానుల కోసం ఒక స్పెషల్ షోను హైదరాబాద్ మల్లికార్జునా ధియేటర్ లో కార్తికేయ ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ స్పెషల్ షోకు రాజమౌళి తన కుటుంబ సభ్యులతో సహా వచ్చి ‘టెంపర్’ సినిమాను ఎంజాయ్ చేస్తాడట. దీనికి సంబంధించిన ఏర్పాట్ల విషయంలో ప్రస్తుతం కార్తికేయ బిజీగా ఉన్నాడని టాక్. ఈ వార్తలు ఇలా ఉండగా నిన్న సెన్సార్ పూర్తి చేఉకున్న ‘టెంపర్’ సినిమాకు సెన్సార్ పెద్దగా ఏమి కట్స్ పెట్ట కుండా ‘యు/ఎ’ సర్టిఫికేట్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమాలోని ఒక రేప్ సీన్ ను కొద్దిగా బ్లర్ చేయమన్నట్లు టాక్. అదేవిధంగా ఒకటి రెండు డైలాగ్స్ అసభ్యకరంగా ఉన్నాయని వాటిని కోత పెట్టినట్లుగా తెలుస్తోంది. ఏది ఎలా ఉన్నా ‘టెంపర్’ ఫీవర్ టాలీవుడ్ లో మొదలైపోయింది.
source:http://www.apherald.com/MOVIES/ViewArticle/78447/RAJAMOULI-SON-STRATEGY-FOR-THE-SAKE-OF-TEMPER/
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.