March 17, 2025 11:02:35 AM Menu
Latest

6:28 PM test1


రేపు విడుదల కాబోతున్న జూనియర్ ‘టెంపర్’ విషయానికి సంబంధించి ఒక ఆ శక్తికర సెంటిమెంట్ ప్రస్తుతం ఫిలింనగర్ లో ఎక్కువగా వినిపిస్తూ ఉండటంతో ఆ వార్తలు జూనియర్ అభిమానుల వరకు చేరి వారికి టెన్షన్ ను పెడుతున్నాయి అని టాక్. ఇక వివరాలలోకి వెళితే దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమాలకు సంబంధించి ట్రైలర్స్ లో ఉన్న పవర్ ఈ మధ్యకాలంలో అతడు తీసిన సినిమాలలో కనిపించడంలేదనే టాక్ ఉంది.

దీనికి ఉదాహరణగా రెండు సంవత్సరాల నుంచి పూరి దర్శకత్వం వహించిన ‘దేవుడు చేసిన మనుషులు’, ‘ఇద్దరు అమ్మాయిలతో’, ‘హార్ట్ ఎటాక్’ సినిమాలు ట్రైలర్స్ తో చేసిన హడావిడి అసలు సినిమా విడుదల అయ్యాక ఆ సినిమాలలో సరైన కథ లేక సరైన హిట్ ను ఇవ్వలేక పోయాయి. ఇప్పుడు ‘టెంపర్’ విషయంలో కూడా ట్రైలర్ విషయంలో విపరీతమైన క్రేజ్ వచ్చిన నేపధ్యంలో గత సెంటిమెంట్ ను కొనసాగిస్తూ సరైన కథ లేక ‘టెంపర్’ బాక్స్ ఆఫీసు వద్ద తేడా చేస్తుందా అనే భయం జూనియర్ అభిమానులను కలవర పెడుతోంది అనే మాటలు వినపడుతున్నాయి.

దీనికి తోడు గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్ సినిమాల చరిత్రను పరిశీలిస్తే ఒక పోలీసు పాత్రతో ఉన్న సినిమా సూపర్ హిట్ అయిన తరువాత అదే పోలీసు పాత్రతో కొద్దిరోజులకే విడుదల అయిన సినిమాలు గతంలో విజయం సాధించిన దాకలాలు లేవు అనే ప్రచారం ఉంది. దీనితో పటాస్ హిట్ భయం టెంపర్ ను టెన్షన్ పెడుతోంది.

ఈ వార్తలు అన్నీ రేపు విడుదల కాబోతున్న తమ యంగ్ టైగర్ ‘టెంపర్’ కు సెంటిమెంట్ గా మారి ఏమైనా నెగిటివ్ ఫలితాన్ని ఇస్తాయా అనే భయం యంగ్ టైగర్ అభిమానులకు టెన్షన్ గా మారింది అని అంటున్నారు. అంతేకాకుండా ‘టెంపర్’ విడుదలకు సంబంధించి ఛానల్స్ లో ఇంకా పూర్తి పబ్లిసిటీ ప్రారంభం కాకపోవడం జూనియర్ అభిమానులకు మరింత ఖంగారు పెడుతోంది.

source:http://www.apherald.com/MOVIES/ViewArticle/78522/PURI-SENTIMENT-BECOMING-TENSION-TO-JUNIOR-FANS/
12 Feb 2015

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top