హీరో ప్రభాస్ ఇక భవిష్యత్ లో టాప్ హీరోయిన్స్ కాజల్, తమన్నా, సమంతలతో పాటుగా యంగ్ హీరోయిన్స్ రకుల్, రెజీనా లతో కూడా నటించను తనకు ఒక కొత్త అమ్మాయిని వెతకండి అని ప్రభాస్ తన తదుపరి సినిమాకు దర్శకత్వం వహించబోతున్న దర్శకుడు సుజిత్ కు సూచనలు ఇచ్చినట్లు టాక్.
బాహుబలి’ విడుదల తరువాత యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమాను చేస్తున్న నేపధ్యంలో ఈ సలహాను ప్రభాస్ తన దర్శకుడు సుజిత్ కు ఇచ్చినట్లు టాక్. ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మించిన ‘రన్ రాజా రన్’ సినిమాకు దర్శకత్వం వహించిన సుజిత్ ప్రతిభ నచ్చడంతో ప్రభాస్ ‘బాహుబలి’ తరువాత ఈ దర్శకుడు సినిమాలో నటిస్తున్న సందర్భంగా ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.
అయితే టాప్ యంగ్ హీరోలంతా వరస పెట్టి పంచుకుంటున్న టాప్ హీరోయిన్స్ ను వదులుకుని ఈ కొత్త అన్వేషణ ప్రభాస్ ఎందుకు మొదలు పెట్టాడో చాలామందికి అర్ధం కావడం లేదు. తన సినిమా బడ్జెట్ ను తగ్గించాలి అన్న ఉద్దేశ్యంతో ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకున్నాడా? లేదంటే ఒకేసారి మూకమ్మడిగా టాప్ హీరోయిన్స్ పై ప్రభాస్ కోపం పెంచుకున్నాడా అనే విషయం అంతు చిక్కని విషయం అని అంటున్నారు.
అయితే ఈ లేటెస్ట్ రూమర్ మాత్రం ప్రస్తుతం టాలీవుడ్ ను ఒక చుట్టు చుట్టేస్తున్న టాప్ హీరోయిన్స్ అందరికీ షాకింగ్ న్యూస్ అనుకోవాలి.
source:http://www.apherald.com/Movies/ViewArticle/78274/PRABHAS-DECESSION-BECAME-SHOCKING-NEWS-TO-TOP-HEROINES/
0 comments:
Post a Comment