March 15, 2025 02:49:35 AM Menu
Latest

6:28 PM test1

హీరో నాగార్జున నిన్న ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ పాలియేటివ్‌ కేర్‌ సదస్సులో తన తల్లితండ్రులను గుర్తుకు చేసుకుంటూ చేసిన కామెంట్స్ అందర్నీ ఆశ్చర్య పరిచాయి. తన తల్లి అన్నపూర్ణ అనారోగ్యంతో చివరి రోజులలో పడిన బాధ మాటలతో చెప్పలేనిదని అని అంటూ తన తల్లిని గుర్తుకు చేసుకుంటూ కంట కన్నీరు పెట్టుకున్నాడు.

అటువంటి సమయంలో క్యాన్సర్ తో బాధ పడేవారికి పాలియేటివ్ కేర్ సేవలు ఉంటాయని అప్పట్లో తనకు ఎవరూ చెప్పలేదని అన్నాడు. కేన్సర్‌, ఇతర వ్యాధులతో బాధపడేవారిని ఆఖరి దశలో ఆదుకునే పాలియేటివ్‌ కేర్‌ ఆవశ్యకత చాలా ఉందని నాగ్ అభిప్రాయ పడ్డాడు. అనారోగ్యంతో తన తల్లి ఏడేళ్లు బాధపడిందని, చివరి ఆరునెలలూ ఆమె పడిన బాధ తనను తీవ్రంగా కలచివేసిందని నాగార్జున చెప్పాడు.

చికిత్సలతో ఆమె భరించలేని నొప్పులు అనుభవిస్తూ ఒకానొక దశలో ఆమె 30 ఏళ్ల క్రితం తన తండ్రితో మద్రాసులో గడిపిన రోజులను తలచుకుని తనలో తానే మాట్లాడుకునేదని చెబుతూ దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు నాగ్. కానీ తన తండ్రి అక్కినేని బాధ అంటూ ఏంటో తెలియకుండా తాను చూసుకున్నానని, ఆయన ముఖంలో సంతోషం తగ్గకుండా పంపించామని నాగార్జున చెప్పాడు.

పాలియేటివ్‌ కేర్‌ గురించి తెలియడంతో ఆయనకు ఆ సేవలను అందించామని వెల్లడించాడు. సినిమాలలో వెండితెర మన్మధుడిగా ఎప్పుడూ నవ్వుతూ కనిపించే నాగార్జున మాటలు ఆ సమావేశానికి వచ్చిన వారందరిని ఆశ్చర్య పరిచాయి.

source:http://www.apherald.com/Movies/ViewArticle/78706/NAGARJUNA-SHOCKING-COMMENTS-ON-HIS-MOTHER-AND-FATHER-/
14 Feb 2015

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top