March 13, 2025 03:31:21 PM Menu
Latest

6:28 PM test1

ప్రముఖ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజ్ సినిమాలపై చేసే జెడ్జిమెంట్ చాలా మటుకు విజయవంతం అవుతుంది అని టాలీవుడ్ లో ఒక ప్రచారం ఉంది. దీనికి ఉదాహరణగా దిల్ రాజ్ ఈ మధ్య ఎంతో సాహసం చేసి విడుదల చేసిన కళ్యాణ్ రామ్ ‘పటాస్’ సినిమా తో సాధించిన సూపర్ సక్సస్ ను లేటెస్ట్ ఉదాహరణగా చెపుతారు. ఈపరిస్థితులలో దిల్ రాజ్ విలక్షణ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ సినిమా రైట్స్ తీసుకోవడం ప్రస్తుతం టాపిక్ అఫ్ టాలీవుడ్ గా మారింది.

మణిరత్నం ప్రస్తుతం తమిళ, మలయాళ భాషల్లో ‘ఓకే కన్మణి' పేరుతో ఒక వెరైటీ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే ఈసినిమాను తెలుగులో కూడా డబ్ చేస్తున్నారు. ఇందులో మమ్ముట్టి తనయుడు దుల్కేర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రాన్ని ‘ఒకే బంగారం' పేరుతో తెలుగులో విడుదల చేయనున్నారు.

ఈ సినిమా పై మణిరత్నం చాలా ఆశలు పెట్టుకున్నాడు. గత కొద్ది కాలంగా వరుస పరాజయాలతో సతమత మవుతున్న మణిరత్నంకు ఈసినిమా విజయం చాలా కీలకంగా మారింది. మొదట్లో ఈకధను మణిరత్నం రామ్ చరణ్ కు వినిపించి అతడితో తీద్దామని చాల ప్రయత్నాలు చేసాడు. అయితే ఈకథ రామ్ చరణ్ కు నచ్చకపోవడంతో మణిరత్న మమ్ముట్టి తనయుడు దుల్కేర్ సల్మాన్ తో తీస్తున్నాడు ఈసినిమా చిత్రీకరణ పూర్తి కావడంతో ఈసినిమాను ఏప్రిల్‌లో విడుదల చేయడానికి మణిరత్నం సన్నాహాలు చేస్తున్నాడు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈసినిమా తెలుగు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో దిల్ రాజ్ లక్ మణిరత్నం పై ఎలా పని చేస్తుందో అన్న ఆశక్తి అందరిలో కలిగిస్తోంది.

source:http://www.apherald.com/Movies/ViewArticle/78704/DILRAJ-SENTIMENT-FOR-MANI-RATNAM/
14 Feb 2015

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top