గత శుక్రువారం విడుదలైన ‘షమితాబ్’ బాలీవుడ్ లో సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. అంతేకాదు ఈ సినిమా పై విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ తో సమానంగా మంచి నటను ప్రదర్శించిన ధనుష్ కు బాలీవుడ్ మీడియాలో మంచి మార్కులు పడుతున్నాయి. జాతీయ ఛానల్స్ కూడా ధనుష్ తో ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేక ఇంటర్వ్యూలు ప్రసారం చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో మంచి జోష్ మీద ఉన్న ధనుష్ ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను తమిళంలో డబ్ చేయడం కన్నా అమితాబ్ పాత్రను తన మామ రజినీకాంత్ చేత నటింప చేసి రజినీకాంత్ గోoతుకతో తాను షమితాబ్ మారితే బాగుంటుంది అన్న ఆలోచనను ధనుష్ రజినీకాంత్ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు అంత భారీ బడ్జెట్ అవసరంలేదు కాబట్టి ఈ సినిమాను అతి తక్కువ కాలంలో నిర్మించి ఈమధ్య ‘లింగ’ వ్యవహారంలో నష్టపోయిన బయ్యర్లకు ఇచ్చివేస్తే ప్రస్తుతం రజినీకాంత్ ను విమర్శిస్తున్న ‘లింగ’ బయ్యర్లకు సహాయం చేసినట్లుగా ఉండటమే కాకుండా రజినీ పాపులారిటీకి తన ఇమేజ్ కూడా తోడై మంచి లాభాలతో ఈ సినిమా రీమక్ నుండి బయటకు రావచ్చని ధనుష్ రజినీకి సలహా ఇస్తున్నట్లు టాక్.
అయితే రజినీకాంత్ మాత్రం ఈ సినిమా తనకు బాగా నచ్చినా అమితాబ్ నటించిన పాత్రలో తాను నటిస్తే తన అభిమానులు చూస్తారా అన్న సందేహంలో ఉన్నట్లుగా కోలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది.
source:http://www.apherald.com/Movies/ViewArticle/78267/CAN-RAJANIKANTH-OBLIGE-DHANUSH-REQUEST/

0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.