ఎన్టీఆర్, టెంపర్ ఆడియో ఫంక్షన్ లో చెప్పినట్టుగానే, అభిమానులంతా కాలర్ ఎగరేసుకొని తిగిగే హిట్ ఇవ్వడమే కాకుండా బాక్స్ ఆఫీసు వద్ద సూపర్బ్ కలెక్షన్స్ ని రాబట్టుకున్తున్నాడు. కథా పరంగా ఈ మూవీ అందరికి నచ్ఛడంతో, అందులోనూ స్టార్ డం కలిగి ఉన్న హీరో ఇందులో నటించడంతో ఈ మూవీపై అందరి చూపు పడింది.
రిలీజ్ నాటి నుండి టెంపర్ మూవీ కలెక్షన్స్ ఎక్కడా తగ్గకుండా వస్తున్నాయి. ముఖ్యంగా టెంపర్ మూవీకి మహిళలు ఎక్కువుగా కనెక్ట్ అయ్యారు. దీంతో మహిళా ప్రేక్షకులు సైతం టెంపర్ మూవీని చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. ఇదిలా ఉంటే, ఈ సినిమాకి మొదటి రోజు నుంచే నైజాంలో అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. మొదటి మూడు రోజుల్లోనే నైజాంలో 5 కోట్ల మార్క్ ని దాటింది. అలాగే ఈ సినిమా వీక్ డే అయిన సోమవారం కూడా కలెక్షన్స్ ని భారీగానే రాబట్టుకుంది.
అలాగే ఫెస్టివల్ హాలిడేస్ గా వచ్చిన మహాశివరాత్రి పర్వదినాన, టెంపర్ మూవీకి కలెక్షన్స్ బాగా పెరిగాయని అంటున్నారు. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం నైజాంలో మొదటి 7 రోజుల్లో 7.8 కోట్ల షేర్ ని సాధించింది. మొదటి వారంలో ఈ సినిమా 10 కోట్ల మార్క్ ని టచ్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు. నైజాం కలెక్షన్స్ తో డిస్ట్రిబ్యూటర్స్ సైతం హ్యాపీగా ఉన్నారనే టాక్ వినిపిస్తుంది.
source:http://www.apherald.com/MOVIES/ViewArticle/79096/Bandla-ganesh-tollywood-telugu-films-temper-poori-/
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.