రాంగోపాల్‌వర్మ 'సావిత్రి' అంటూ పరిచయం చేసిన ఈమె ఆ తర్వాత 'శ్రీదేవి'గా మారింది. తన పేరుని బద్నాం చేస్తున్నారని శ్రీదేవి లీగల్‌గా ప్రొసీడ్ అయితే... పక్కింటి పారిజాతం కథని పూర్తిగా పక్కన పడేసాడు వర్మ. చిన్న పిల్లాడి మనసు పాడు చేసే మిడిల్ ఏజ్ ఆంటీగా పోస్టర్లలోనే కిర్రెక్కించిన ఈ అమ్మడి పేరు అనుక్రితి శర్మ. వర్మ పుణ్యమా అని బ్రేక్ వస్తుందనుకుంటే తన తొలి సినిమాకి పోస్టర్ల దశలోనే బ్రేక్ పడింది. అటుపై ఈ సావిత్రిని ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకే తనేంటో చూపించడానికి మీడియా ముందుకొచ్చింది.
ఫోటోగ్రాఫర్లు అడక్కుంగానే వివిధ యాంగిల్స్‌లో అందాలు ఆరబోసి... ప్రొఫెషనల్స్‌కి కూడా షాకిచ్చింది. ఇంత డెస్పరేట్‌గా ఉన్న ఈమెకి ఎవరైనా నిజంగా సినిమా అవకాశం ఇస్తే దానిని సద్వినియోగం చేసుకోడానికి ఇంకా ఎన్నెన్ని చేస్తుందో అని అనుక్రితి భంగిమలు చూసిన వారు బుగ్గలు నొక్కేసుకున్నారు. ఎవరూ కేర్ చేయకపోతే తను తీసే ఐస్‌క్రీమ్ సినిమాల్లో ఏదో ఒకటి అయినా ఈమెకిచ్చి వర్మే ఈమె ముచ్చట తీర్చాలి.
source: http://telugu.gulte.com/tmovienews/8583/Anukriti-Hot-Photo-shoot#sthash.8Xg9YyJ5.dpuf
0 comments:
Post a Comment