March 17, 2025 12:20:54 PM Menu
Latest

6:28 PM test1

Ameer-Khan-Rajnikanth-Robo-Shankar

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రజనీకాంత్ సూపర్ స్టార్  అయితే, బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరో అమీర్ ఖాన్. వీరిద్దరిపై ప్రస్తుతం ఓ న్యూస్ హాట్ టాపిక్ గా వినిపిస్తుంది. వివరాల్లోకి వెళితే, ఇండియన్‌ ఫిల్మ్ ఇండస్ట్రీలో శంకర్‌, రజనీకాంత్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'రోబో' చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది.

ఈ సినిమాకు సీక్వెల్‌ వస్తుందని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై శంకర్‌ గానీ, రజనీ గానీ ఇప్పటి వరకు స్పందించ లేదు. ఈ సీక్వెల్లో రజనీ నటించడం లేదనే వార్తలు కూడా ఆ మధ్య హల్‌చల్‌ చేశాయి. తాజాగా మరోసారి 'రోబో' సీక్వెల్‌ వస్తుందంటూ కోలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. అయితే ఈ సారి రజనీకాంత్‌, అమీర్‌ ఖాన్‌ కలిసి నటిస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇందుకు సంబంధించిన పనుల్లో రజనీ, శంకర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాను బడ్జెట్‌ విషయంలో మేకర్స్‌ కి ఇంకా క్లారిటి రాలేదు.

రోబో చిత్రానికే దాదాపు 100 కోట్ల రూపాయల బడ్జెట్ ని టచ్ చేస్తే, ఈ సీక్వెల్‌కు దాదాపు 200 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు.మరి ఇంత బడ్జెట్‌తో సినిమాను నిర్మించడానికి ఎవరు ముందుకు వస్తారనే ప్రశ్న నెలకొంది. అయితే సన్ నెట్ వర్క్, అలాగే ఈరోస్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించే అవకాశం ఉందని కోలీవుఢ్ వర్గాల్లో టాక్స్ వినిపిస్తుంది. మొత్తంగా శంకర్, రోబో2 అంటూ మళ్ళీ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు.
07 Feb 2015

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top