రామ్ గోపాల్ వర్మ ఎందరినో తన కామెంట్స్ ద్వారా టార్గెట్ చేసాడు. అతడి కామెంట్లకు దేవుళ్ళు కూడా భయపడి పోయారు. అటువంటి వర్మను టాలీవుడ్ సినిమా రంగంలో నిలదొక్కుకుంటున్న తాగుబోతు రమేష్ టార్గెట్ చేయబోతున్నాడా అనే వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో వర్మను అందరు షార్ట్ కట్ లో ఆర్ జి వి అని పిలుస్తూ ఉంటారు.
ప్రస్తుతం తాగుబోతు రమేష్ హీరోగా నటిస్తున్నసినిమాకు ‘తాగుబోతు’ అన్న టైటిల్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు ‘ఆర్జీవీ' అనేది సబ్ కాప్షన్ గా నిర్ణయించారు అనే వార్తలు వస్తున్నాయి. దీనితో ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ పై సెటైర్లు ఉంటాయా అనే అనుమానం చాలామందికి కలుగుతోంది. ఇప్పటికే వర్మను టార్గెట్ చేస్తూ అనేక సినిమాలు రావడంతో ఈ అనుమానం చాలామందికి కలుగుతోంది.
అయితే ఆర్జీవీ అంటే వ్యక్తి పేరు కాదు రమ్, జిన్, వైన్ అంటున్నారు ఈ సినిమా యూనిట్ సభ్యులు. కన్నడ, తెలుగులో రూపొందిస్తున్నారు నిర్మాత ఎన్.ఎమ్.కాంతారాజ్. బి.ఎన్.ఎమ్ కంబైన్స్ పతాకంపై రూపొందుతోంది. మేఘనా పటేల్ నాయిక. ఈ సినిమా షూటింగ్ ఈరోజు నుంచి మొదలు కానున్నది.
ఇప్పటికే తాగుబోతు పాత్రలకు చిరునామాగా మారిన రమేష్ ఇదే పాత్రలను వందల సంఖ్యలో చేసిన ఎమ్ ఎస్ నారాయణ మరణించడంతో ఇప్పుడు టాలీవుడ్ లో ఇటువంటి పాత్రలకు మిగిలిన ఏకైక చిరునామా రమేష్ అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

0 comments:
Post a Comment